రామ్ చరణ్ నెక్ట్స్ ఖరారైంది..క్యారెక్టర్ ఏంటంటే

By Srikanya

హైదరాబాద్ : గోవిందుడు అందరి వాడేలే చిత్రం తర్వాత రామ్ చరణ్ ఏం చిత్రం చేయబోతున్నారనే ఆసక్తి అభిమాముల్లో కలగటం సహజం. శ్రీనువైట్ల కథ చెప్పాడని, లౌక్యం డౌరక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కాదని ఇప్పుడు ఓ ప్రముఖ తమిళ దర్శకుడు డైరక్షన్ లో చిత్రం కమిటయ్యాడని సమాచారం.

గౌతమ్‌ మీనన్‌, రామ్‌చరణ్‌ కలయికలో రూపొందబోయే చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈలోగా చరణ్‌ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ పోలీస్‌గా కనిపిస్తారని సమాచారం. అందుకే చరణ్‌ హెయిర్‌ స్త్టెల్‌ మార్చాడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ప్రస్తుతం గౌతమ్ మీనన్ చేస్తున్న చిత్రం విషయానికి వస్తే...

Ram Charan may change his hair style

ద్విపాత్రాభినయం హీరోలు రెగ్యులర్ చేస్తూంటారు. అయితే హీరో మూడు పాత్రల్లో కనిపించటం మాత్రం చాలా తక్కువే. ప్రస్తుతం అజిత్ అలా మూడు పాత్రల్లో కనిపించటానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆయన చిత్రం రూపొందుతోంది. ఇందులో అజిత్‌ మూడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

సక్సెస్, ఫెయిల్యూర్ లకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎవర్‌గ్రీన్‌ మాస్‌, కమర్షియల్‌ ఇమేజ్‌ ఉన్న హీరో అజిత్‌. ప్రస్తుతం గౌతంమీనన్‌ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తున్నారు. అనుష్క, త్రిష హీరోయిన్స్. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టకపోయినా.. అప్పుడప్పుడు విడుదల చేస్తున్న చిత్ర పోస్టర్లు మాత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో అజిత్‌ తెల్లజుట్టుతో ఉన్న ఫొటోలు వచ్చాయి.

ఆ తర్వాత మంగాత్తా, వీరం, ఆరంభం... చిత్రాల్లో మాదిరి సాల్ట్‌పెప్పర్‌తో ఓ ఫొటో విడుదలైంది. కొన్ని రోజుల కిందట అజిత్‌ చాలా స్మార్ట్‌గా, యువకుడిలా నల్లజుట్టుతో ఉన్న ఫొటోలు విడుదలై అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నల్లజుట్టు, గడ్డంతో ఉన్న మాస్‌ ఫొటో తాజాగా విడుదలై ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

గతంలో వచ్చిన 'దీనా' చిత్రంలో ఉన్నట్లు అజిత్‌ కనిపిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌, పాటలను విడుదల చేసే అవకాశముందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X