Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
దానిపై రామ్ చరణ్ మనసు పడ్డాడా..? మహేష్ బాబు అలా అంటే చెర్రీ ఇలానా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి జోష్‌లో ఉన్నారు. హీరోగా, నిర్మాతగా తన టాలెంట్ నిరూపించుకుంటూ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. హీరోగా నటించడం, సినిమాలు నిర్మించడాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్న ఆయన.. ఇటీవలే విడుదలై సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాపై మనసు పడ్డారని టాక్ నడుస్తోంది.
ధనుష్ హీరోగా తమిళ్లో విడుదలైన 'అసురన్' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం స్పందిస్తూ ఈ సినిమా సూపర్ అని కితాబిచ్చారు. అలాంటి సినిమాపై ఇప్పుడు రామ్ చరణ్ కన్ను పడింది.
'అసురన్' మూవీ కంటెంట్ తీసుకొని ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రామ్ చరణ్. రా కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తనకు సూట్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టే చరణ్ ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. చూడాలి మరి ఈ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తారా? లేదా? అనేది.
మరోవైపు రామ్ చరణ్ RRR ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో చెర్రీతో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.