రామ్ చరణ్ తాజా చిత్రం 'మెరుపు' కూ 'ఆరెంజ్' సమస్యే..
రామ్ చరణ్ తాజా చిత్రం మెరుపు షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. దానికి కారణం..రామ్ చరణ్ అతి జాగ్రత్తలే అంటున్నారు. స్క్రిప్ట్ లోపాలతో ఆరెంజ్ చిత్రం ఊహించని విధంగా ప్లాప్ కావటంతో రామ్ చరణ్ ఈ చిత్రం స్క్రిప్టు మొత్తం తిరగరాయిస్తున్నాడని తెలుస్తోంది. ధరణి చెప్పిన స్టోరీ లైన్ కి ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయని, మరోసారి స్క్రిప్టు ఫైనలైజ్ అయ్యాకే షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. అందులోనూ ధరణి...కథ కన్నా యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఎక్కువ ఆధారపడ్డాడని, కథ క్లారిటీగా ఉండాల్సిందేనని చిరంజీవి కూడా మందలించటం కూడా ఓ కారణణంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి హీరోయిన్ సమస్య వచ్చింది. కాజల్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చేతులు ఎత్తేసింది. ఫుట్ బాల్ నేపధ్యంలో జరిగే ఈ చిత్రం...ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ కావాలని ఆ మేరకు వర్క్ జరగాలని రామ్ చరణ్ ఆదేశించాడని తెలుస్తోంది. ఇక ధరణి గతంలో పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం చేసారు. ఆ చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











