ఇంజినీరింగ్ కాలేజికి వెళ్తున్న రామ్ చరణ్
రామ్ చరణ్ తేజ రేపు రిలీజయ్యే రచ్చ చిత్రంలో మెడికో గా మెడికల్ కాలేజికి పోనున్న సంగతి తెలిసిందే. అలాగే వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇంజినీరింగ్ కాలేజికి పోనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని శ్రేయా ఇండినీరింగ్ కాలేజీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. కాజల్ ఈ చిత్రం చరణ్ సరసన కవ్వించనుంది. అలాగే ఫ్యామిలీ డ్రామా గా చెప్పబడుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం ఎక్కువ భాగం ఉంటాడని తెలుస్తోంది. బ్రహ్మి డేట్స్ ఎక్కువ తీసుకోవటంతో ఈ వార్త బయిటకు వచ్చింది.
ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకొంటున్నారో బాగా తెలిసిన దర్శకుడు వి.వి.వినాయక్. అటు మాస్‌నీ, ఇటు యువతనీ సమంగా మెప్పిస్తారు. పూర్తిస్థాయి మాస్ అంశాలున్న చిత్రమిది. నా పాత్ర భిన్న కోణాల్లో కనిపిస్తుంది. మగధీర తరవాత కాజల్‌తో చేస్తున్న చిత్రమిది. చక్కటి సంగీతం తోడైందని రామ్ చరణ్ అన్నారు. వివి వినాయిక్ తో ఆయన చేస్తున్న షూటింగ్ ఫస్ట్ లుక్ నిన్న సాయింత్రం విడుదల చేసారు. ఆ సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. అలాగే ..వివి వినాయిక్ మాట్లాడుతూ..మా చిత్రం చాలా బలమైన కథతో రూపుదిద్దుకొంటోంది. చిరంజీవి అభిమానులు ఆశించే అన్ని హంగులూ ఉంటాయి. ఫైట్స్ కథలో చాలా కీలకమైనవి అన్నారు.
ఇక ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో నిలబడిపోయే చిత్రమని అంటున్నారు. ఆకుల శివ కధ అందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చే కుమారుడుగా కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఈ చిత్రం కాక రచ్చ చిత్రం ప్యాచ్ వర్క్ లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. వినాయిక్..అల్లు అర్జున్ తో చేసిన బద్రీనాధ్ తర్వాత రూపొందిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రానికి చెర్రీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











