twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రంగస్థలం’ :వారి మధ్య ఆధిపత్య పోరు? ఎవరీ చిట్టిబాబు?

    By Bojja Kumar
    |

    Recommended Video

    ‘రంగస్థలం’ స్టొరీ లీకైంది..!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం 1985'. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, సెట్స్ కు సంబంధించిన స్టిల్స్ మాత్రమే బయటకు వచ్చాయి. తాజాగా సినిమా స్టోరీకి సంబంధించిన సమాచారం లీకైంది.

    ఆధిపత్యపోరు నిజమేనా?

    ఆధిపత్యపోరు నిజమేనా?

    ‘రంగస్థలం 1985' మూవీ గోదావరి తీరంలోని ఓ పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుందని.... ఆ ఊరిలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఓ వర్గాన్ని లీడ్ చేసే పాత్రలో జగపతి బాబు కనిపిస్తారని సమాచారం.

     ఎవరీ చిట్టిబాబు?

    ఎవరీ చిట్టిబాబు?

    సినిమా కథలో కీలకంగా చిట్టిబాబు పేరు వినిపిస్తోంది. ఈ పాత్రలో కనిపించేది మరెవరో కాదని, రామ్ చరణ్ అని తెలుస్తోంది. చిట్టి బాబు గోదావరిలో బోటు నడుపుతూ జీవనం కొనసాగిస్తాడని, ‘రంగస్థలం' కథలో చిట్టి బాబు పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు.

     గేదెలు కాసుకునే అమ్మాయిగా సమంత

    గేదెలు కాసుకునే అమ్మాయిగా సమంత

    ఈ చిత్రంలో హీరోయిన్ సమంత గేదెలు కాచుకునే అమ్మాయిగా కనిపించబోతోంది. సమంత పాత్ర పేరు మహాలక్ష్మి. చిట్టిబాబు అంటే మహాలక్ష్మికి ప్రాణం. ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు.

     అన్నయ్య పాత్రలో ఆది పినిశెట్టి

    అన్నయ్య పాత్రలో ఆది పినిశెట్టి

    రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో ఆది పినిశెట్టి కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆది పాత్ర కూడా కీలకంగా ఉంటుందని అంటున్నారు.

     రంగస్థలం అంటే...

    రంగస్థలం అంటే...

    ఈ సినిమాకు ‘రంగస్థలం' అనే పేరు పెట్టగానే చాలా మందికి ఇది ఎలాంటి సినిమానో అర్థం కాలేదు. ఇది పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమా అని, 1985 ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుందని సుకుమార్ చెప్పడంతో అందరికీ ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ సినిమాలో ‘రంగస్థలం' అనేది ఆ ఊరి పేరు అని అంటున్నారు.

     పాపికొండల అందాలు

    పాపికొండల అందాలు

    ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారు. సినిమా ఎక్కువ భాగం గోదావరి తీరం, పాపికొండలు ప్రాంతంలో తీశారు. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేనంత అందంగా ఈ చిత్రంలో గోదావరి అందాలు మనం చూడబోతున్నాం.

     ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

    ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

    రంగస్థలం చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించే సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రూ. 45 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    English summary
    Ram Charan movie 'Rangasthalam' story revealed. Rangasthalam 1985 is Telugu period drama directed by Sukumar and starring Ram Charan and Samantha Akkineni in the lead of roles. The movie will see Ram Charan play a villager and is an action thriller story set in the country side.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X