Allu Arjun రెజెక్ట్ చేసిన కథతో రామ్ చరణ్ మూవీ! లోకేష్ కనగరాజ్ స్కెచ్.. తేడా కొడుతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రౌద్రం రణం రుధిరం మూవీ అనేక అవార్డులతో పాటు ఆస్కార్ ను సైతం కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాలపై మరింత క్యూరియాసిటీ, అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే చెర్రీ సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ RC15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ 'విక్రమ్' మూవీ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అల్లూరి సీతరామరాజుగా..

అల్లూరి సీతరామరాజుగా..

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. తర్వాత మగధీర సినిమాతో చిన్నా పెద్దా అని తేడ లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. వరసుగా పలు సినిమాలు చేస్తూ మెగా పవర్ స్టార్ గా మారిన చెర్రీ.. ఇటీవల RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అల్లూరి సీతారామరాజుగా అలరించిన రామ్ చరణ్ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

కమ్ బ్యాక్ హిట్ ఇచ్చిన..

కమ్ బ్యాక్ హిట్ ఇచ్చిన..

ప్రస్తుతం రామ్ చరణ్ క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ఉప్పెన సినిమా ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా కూడా ఓకే అయినట్లు వార్తలు వచ్చాయి. ఇలా రెండు మూడు సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టిన రామ్ చరణ్ తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు కమ్ బ్యాక్ హిట్ ఇచ్చిన విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఓ సినిమా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

లోకీ యూనివర్స్ లో..

లోకీ యూనివర్స్ లో..

గతేడాది కమల్ హాసన్ విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టారు. ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఖైదీ, విక్రమ్ చిత్రాలతో లోకీ సినిమాటిక్ యూనివర్స్ అనే కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఇందులో భాగంగానే ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు రానున్నాయన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయ్ హీరోగా నటిస్తున్న లియో సినిమా కూడా ఆ యూనివర్స్ కు సంబంధించినదని జోరుగా టాక్ నడుస్తోంది. వార్తలు వినిపిస్తున్నాయి.

చెర్రీ కెమియో రోల్..

చెర్రీ కెమియో రోల్..

విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక విక్రమ్ మూవీతో లోకీ రేంజ్ నేషనల్ స్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లియో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన లియో ప్రోమో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కెమియో రోల్ చేస్తున్నట్లుగా పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇందులో కెమియో రోల్ కాదు ఏకంగా చెర్రీతో లోకేష్ సినిమా చేస్తున్నట్లు కొత్త టాక్ వస్తోంది.

బన్నీ రెజెక్ట్ చేయడంతో..

బన్నీ రెజెక్ట్ చేయడంతో..

అయితే లోకేష్ కనకరాజ్ అనుకున్న స్క్రిప్ట్ ను ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెప్పాడట. కానీ దాన్నీ బన్నీ రెజెక్ట్ చేయడంతో అదే స్క్రిప్ట్ ను చెర్రీతో తెరకెక్కించాలనుకుంటున్నాడట లోకేష్. ఈ కథకు సంబంధించి లోకేష్ తో మాట్లాడిన వీడియో కాల్ లో చరణ్ పాజిటివ్ గా స్పందించాడని, త్వరలో వీళ్లిద్దరు హైదరాబాద్ లో సమావేశం కానున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రామ్ చరణ్ ఒప్పుకుంటే లియో మూవీ తర్వాత చెర్రీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లానున్నాడట లోకేష్ కనకరాజ్.

చెర్రీతో ఎలా తీస్తారు..

చెర్రీతో ఎలా తీస్తారు..

ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం వైరల్ కాగా.. లియో తర్వాత కార్తితో ఖైదీ 2 తీస్తానని లోకేష్ కనకరాజ్ చెప్పారు. అదే విషయాన్ని కార్తీ కూడా చెప్పారు. ఇప్పుడు మరి రామ్ చరణ్ తో సినిమా ఎలా తీస్తారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లియో తర్వాత చెర్రీతో లోకేష్ సినిమా ఉంటుదన్న వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఎలాంటి ఫలితం ఉంటుందో..

ఎలాంటి ఫలితం ఉంటుందో..

ఇదిలా ఉంటే ఇప్పటివరకు ముగ్గురు కోలీవుడ్ డైరెక్టర్స్ చెప్పిన కథలను అల్లు అర్జున్ రెజెక్ట్ చేశాడు. అందులో లింగుస్వామి-రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ది వారియర్ ఒకటి. ఆ మూవీకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తెలిసిందే. అలాగే షారుక్ ఖాన్ తో జవాన్ లో నటించేందుకు అట్లీ సంప్రదించగా బన్నీ ఒప్పుకోలేదు. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడు లోకేష్ కథను కూడా బన్నీ వద్దనుకున్నట్లు తెలుస్తోంది. మరి బన్నీ వద్దనుకున్న కథతో చెర్రీ సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X