విలన్‌గా మారిన రామ్ చరణ్: ఒకే సినిమాలో అన్ని పాత్రలా.. లీకైన బిగ్ సీక్రెట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయినా.. తనలోని అన్ని టాలెంట్లను చూపిస్తూ తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకున్నాడు.

ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు దిగ్గజ దర్శకుడు శంకర్‌తో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరుగుతోంది? దానికి సంబంధించిన పూర్తి వివరాలపై మీరు కూడా ఓ లుక్కేయండి!

భారీ విజయం.. పాన్ ఇండియా స్టార్

భారీ విజయం.. పాన్ ఇండియా స్టార్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే RRR (రౌద్రం రుధిరం రణం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంలో అద్భుతమైన నటనతో తనలోని మరో కోణాన్ని తట్టిలేపాడు. ఇక, ఈ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్‌కు చేరిపోయింది.

‘ఆచార్య'తో చరణ్‌కు ఎదురుదెబ్బ

‘ఆచార్య'తో చరణ్‌కు ఎదురుదెబ్బ

రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితమే మరో సినిమాతో వచ్చాడు. అదే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'ఆచార్య'. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగా మల్టీస్టారర్‌గా వచ్చింది. అయితే, దీనికి ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన లభించలేదు. ఫలితంగా ఇది కలెక్షన్లను రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఈ చిత్రానికి రూ. 80 కోట్ల నష్టాలు వచ్చాయి.

దిగ్గజ దర్శకుడితో మెగా హీరో మూవీ

దిగ్గజ దర్శకుడితో మెగా హీరో మూవీ

ఆచార్య, RRR విడుదల కాకముందే రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. భారీగా రాబోయే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే.

స్పీడుగా షూటింగ్... చాలా పూర్తైంది

స్పీడుగా షూటింగ్... చాలా పూర్తైంది

రామ్ చరణ్ - ఎస్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత రాజమహేంద్రవరంలో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంది. ఆ వెంటనే వైజాగ్‌లోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఇలా ఇప్పటికే చాలా షూట్ కంప్లీట్ అయింది.

భారీ బడ్జెట్... క్లైమాక్స్‌కే అన్ని కోట్లు

భారీ బడ్జెట్... క్లైమాక్స్‌కే అన్ని కోట్లు

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్‌ను హై లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక, ఈ ఎపిసోడ్‌లో బ్లాస్టింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే దీనికి ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించారని తెలిసింది. ఈ ఒక్క పార్ట్ కోసమే దాదాపు రూ. 20 కోట్లు కేటాయించారట. ఇది త్వరలోనే మొదలు కాబోతుంది.

ఒకే మూవీలో చరణ్ అన్ని పాత్రలా

ఒకే మూవీలో చరణ్ అన్ని పాత్రలా

శంకర్ గత చిత్రాల మాదిరిగానే పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ఇందులో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం చరణ్ ఏకంగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట. అందులో ఫ్లాష్‌బ్యాక్‌లో ఒకటి.. మిగితావి ఇప్పటివి అని టాక్.

శంకర్ సినిమాలో విలన్‌గా మెగా హీరో

శంకర్ సినిమాలో విలన్‌గా మెగా హీరో

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఇందులో అతడు మూడు పాత్రలు చేస్తున్నట్లు ముందే చెప్పుకున్నాం. అందులో ఒకటి విలన్ రోల్ కూడా ఉందని తాజాగా తెలిసింది. ఎవరూ ఊహించని విధంగా ఈ పాత్రను డిజైన్ చేశారట. అంతేకాదు, దీనికోసం చరణ్ డిఫరెంట్ గెటప్‌తో కనిపించబోతున్నాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X