రామ్ చరణ్ ని 'ఎవడు' అంటున్న...
రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ని ఎవడు అని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రం లాంచింగ్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో జరగనుంది. ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్ర్రిప్టు వర్క్ పూర్తైన ఈ చిత్రంకి కథను వక్కంతం వంశీ సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. బృందావనం చిత్రం అనంతరం రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ఇది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ సైతం ఓ కీలకమైన పాత్రను పోషించనున్నారు. అల్లు అర్జున్ కనపడేది ఓ పాట,కొద్ది సీన్స్ లో అయినా హైలెట్ గా నిలుస్తుందని, ఓ కొత్త పాయింటుతో ఈ చిత్రం రూపొందుతోందని వినికిడి.
అలాగే ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసారు. మరో ప్రక్క రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చను పూర్తి చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం గ్యాంగ్ లీడర్ తరహాలో సాగే మాస్ మూవీ అంటున్నారు. ఇక వంశీ పైడిపల్లి చిత్రంతో పాటు వినాయిక్ చిత్రం కూడా షూటింగ్ మొదలువుతుంది. 2012 లో రామ్ చరణ్ పూర్తి స్ధాయి బిజీగా ఉంటున్నారు. వీటిన్నట్టికి తోడు వచ్చే సంవత్సరంలో రామ్ చరణ్ వివాహం కూడా జరగనుంది. రామ్ చరణ్ తన కెరీర్ లో ఇక అన్నీ విజయాలో అన్న తరహాలో ముందుకు వెళ్తున్నారు.


Click it and Unblock the Notifications











