twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC15 : రామ్ చరణ్ మరో న్యూ లుక్ వైరల్.. శంకర్ ప్లాన్ మామూలుగా లేదు!

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. RRR సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ తేజ్ కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన హీరో లుక్ విషయంలో శంకర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడో మరొకసారి అర్థమయింది.

    ఇదివరకే ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఫోటోలు చాలావరకు సోషల్ మీడియాలో లీకయ్యాయి. అప్పుడే రామ్ చరణ్ విభిన్నమైన గెటప్లలో కనిపించి ప్రేక్షకులలో అంచనాల స్థాయిలు ఒక్కసారిగా పెంచేసాడు. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరొక ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఒక కీలకమైన షెడ్యుల్ లో బిజీగా ఉన్నా రామ్ చరణ్ మళ్లీ తన ఫేస్ కట్ మార్చినట్లుగా తెలుస్తోంది.

    Ram charan new look for shankar RC 15 project

    అందులో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ముందుగా విడుదల చేసిన ఒక పోస్టర్ లో అయితే పర్ఫెక్ట్ బిజినెస్ మెన్ లా కనిపించినా రామ్ చరణ్ ఆ తర్వాత ఒక లీకైన మరొక ఫోటోలో రిక్షా తొక్కుతూ కనిపించాడు. ఇక ఇప్పుడు స్టైలిష్ లుక్ తో ఫ్యాన్స్ లో అంచనాలు స్థాయిని పెంచేస్తున్నాడు.

    సాధారణంగా దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో హీరోను కంప్లీట్ గా విభిన్నమైన రకాల షేడ్స్ లో చూపిస్తూ ఉంటాడు. కథలో భాగంగానే ఆ లుక్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ లో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ ను కూడా అలాగే వాడుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.

    English summary
    Ram charan new look for shankar RC 15 project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X