తమిళ దర్శకుడితో రామ్ చరణ్ న్యూ ప్లాన్.. ఇది నమ్మేలా ఉందా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గత కొంత కాలంగా తన భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం చాలా మంది దర్శకులను కలుస్తున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇక రోజుకో రూమర్ అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. ఇక రామ్ చరణ్ కూడా అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు రూమర్స్ ని నమ్మవద్దని మొన్న చిట్టిబాబు స్టైల్ లో చెప్పాడు.

అయినప్పటికీ రూమర్స్ డోస్ ఏ మాత్రం తగ్గడం లేదు. గ్యాప్ లేకుండా గాసిప్స్ ఒక దాని తరువాత మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. RRR తరువాత వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల వంటి దర్శకులతో సినిమాలు ఓకే అయినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక తమిళ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది.

Ram charan new movie with kollywood director

ఆ దర్శకుడు మరెవరో కాదు. విజయ్ తో మాస్టర్ సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనగరాజన్. కార్తీతో చేసిన ఖైదీ సినిమా కూడా హిట్ అవ్వడంతో లోకేష్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే మాస్టర్ రిలీజ్ తరువాత లోకేష్ తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నాడు.

ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో ఒక ఒప్పందానికి వచ్చిన దర్శకుడు తెలుగు హీరోతోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అయితే మొన్నటివరకు మహేష్ బాబు అని టాక్ రాగా ఇప్పుడు రామ్ చరణ్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే చరణ్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X