ప్రభాస్ స్నేహితులతో రామ్ చరణ్ సినిమా.. మళ్ళీ ఆ దర్శకుడేనా?

మన స్టార్ హీరోలు ఒక్కసారి పాన్ ఇండియా సినిమాలను టచ్ చేస్తే మళ్ళీ అదే కంటిన్యూ అవుతున్నారు. ప్రభాస్ అయితే బాహుబలి అనంతరం రెమ్యునరేషన్ స్తాయిని పెంచేసి వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెట్టేశాడు. వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న ఏకైక స్టార్ హీరోగా కూడా మంచి గుర్తించి అందుకున్నాడు. ఇక ప్రస్తుతం RRR హీరోలు కూడా వరుసగా పాన్ ఇండియా ఫార్మాట్ ను ఫాలో అవ్వబోతున్నారు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ - ప్రశాంత్ నీల్ వంటి స్టార్ దర్శకులతో పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఇక అదే తరహాలో రామ్ చరణ్ కూడా రెడీ అవుతున్నాడు. ఏకంగా శంకర్ తో ఒక పొలిటికల్ డ్రామాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కోసం న్యూ వర్కౌట్స్ చేస్తూ సరికొత్త బాడీ లాంగ్వేజ్ ను కూడా అలవాటు చేసుకుంటున్నాడట.

Ram charan new movie with prabhas friends uv creations latest update

శంకర్ చేతిలో పడితే మరింత కొత్తగా కనిపిస్తారని చెప్పవచ్చు. ఇక ఆ పాన్ ఇండియా సినిమా అనంతరం రామ్ చరణ్ ఎవరితో వర్క్ చేస్తారనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. మధ్యలో చాలామంది పేర్లు వినిపించాయి గాని ఇది కూడా నిజం కాలేదు. ఇక ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ రామ్ చరణ్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు టాక్ వస్తోంది.

ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ అయినటువంటి యూవీ నిర్మాతలతో రామ్ చరణ్ కు మంచి సాన్నిహిత్యం అయితే ఉంది. గతంలోనే చరణ్ వీరికి ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. ఇక యూవీ నిర్మాతలు సాహో డైరెక్టర్ సుజిత్ ను రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు మరొక టాక్ వస్తోంది. గతంలో లూసిఫర్ రీమేక్ అవకాశం వచ్చినప్పుడు మెగాస్టార్ తో సెట్ చేసుకోలేకపోయిన సుజిత్ ఇప్పుడు రామ్ చరణ్ ను ఒప్పిస్తాడో లేదో చూడాలి. అలాగే సుజిత్ బాలీవుడ్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. బహుశా ఆ సినిమా చేసిన తరువాత యూవీ క్రియేషన్స్ తో సినిమా ఉండవచ్చని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X