ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ న్యూ వర్కౌట్స్.. RRRకి బ్రేక్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చరణ్ రోల్ పై ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఈ ఛాన్స్ మిస్సయితే భవిష్యత్తులో మళ్ళీ ఇద్దరం ఇంత మంచి సినిమాలో కలిసి నటించే అవకాశం రాధేమో అని మెగాస్టార్ చరణ్ ని ఫిక్స్ చేయాల్సి వచ్చిందట. అందుకోసం స్పెషల్ గా రాజమౌళిని కూడా రిక్వెస్ట్ చేశారు.
ప్రస్తుతం రామ్ చరణ్ RRR కోసమే ఒక స్పెషల్ లుక్ తో రెడీ అయ్యి ఉన్నాడు. గత నెల నుంచి రాజమౌళి సలహా మేరకు మళ్ళీ చాలా రోజుల తరువాత వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ కొరటాల శివ సలహా మేరకు ఆచార్యలో స్పెషల్ పాత్రకు చరణ్ అయితేనే కరెక్ట్ గా సెట్టవుతాడాని చెప్పడంతో మళ్ళీ ఇప్పుడు కొత్త లుక్ కోసం బరువు తగ్గాల్సి వస్తుందట. దాదాపు 30నిమిషాల పాటు ఉండే ఆ పాత్ర పవర్ఫుల్ గానే ఉంటుందట గాని RRR కోసం రెడీ చేసి బాడీ ఆ పాత్రకు సరితూగడం లేదట. ఇక హెయిర్ స్టైల్ లో కూడా మార్పులు చేయక తప్పదు.

అల్లూరి సీతారామరాజు పాత్రకు ఇబ్బంది ఉండకుండా ఫ్రెష్ లుక్ లోకి రావాలని చరణ్ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఒకవేళ RRR షూటింగ్ స్టార్ట్ అయినా కూడా ముందుగా తారక్ కి సంబంధించిన సీన్స్ ని ఎక్కువగా షూట్ చేయనున్నారు. చరణ్ తో అయితే ఇప్పట్లో పని పడే అవకాశమే లేదు. అందుకే రాజమౌళి అన్ని ఆలోచించే రామ్ చరణ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఆచార్యలో చేయబోయే ఆ పాత్ర ఎంతరకు క్లిక్కవుతుందో చూడాలి. మణిశర్మ ఆ సినిమాను సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











