రామ్ చరణ్, వినాయక్ కాంబినేషన్ టైటిల్?
రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫస్ట్ లుక్ పిక్చర్స్ ని విడుదల చేసిన ఆ టీమ్ ఇప్పుడు సినిమా టైటిల్ పై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఆ టైటిల్ గా మిస్టర్ తీస్ మార్ ఖాన్ అని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే అదే టైటిల్ ఫిక్స్ చేయలేదు. మరో కొన్ని టైటిల్స్ అనుకుని చివరగా ఒకటి ఫిక్స్ చేస్తారని, ప్రస్తుతానికి ఈ టైటిల్ రామ్ చరణ్ కి సైతం నచ్చినట్లు వినికిడి. రచ్చ చిత్రంలో లీకైన టైటిల్ సాంగ్ లో హి ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ అని ఉంటుంది. ఆ పదం కోయినింగ్ బాగుందని అలా ఫిక్సయ్యారు.
ఇక ఈ చిత్రం నవంబర్ 11, 2012వ తేదీన అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఇక ఈ చిత్రం గురించి వివి వినాయిక్ మాట్లాడుతూ..మా చిత్రం చాలా బలమైన కథతో రూపుదిద్దుకొంటోంది. చిరంజీవి అభిమానులు ఆశించే అన్ని హంగులూ ఉంటాయి. ఇప్పుడు చిత్రిస్తున్న ఫైట్స్ కథలో చాలా కీలకమైనవి అన్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











