రామ్ చరణ్ వ్యూహమిదే.. దాదాపు అంతా సిద్ధం చేసేశారట!
సినిమా కథల ఎంపికలో మెగా పవర్ స్టార్ రూటే సపరేటు. అతని దగ్గరకు వచ్చిన ప్రతీ కథను కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అంటుంటాయి సినీ వర్గాలు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అని కూడా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆయన మరో కొత్త సినిమాను లైన్ లోకి తెచ్చేలా అంతా సిద్ధం చేశారని తెలుస్తోంది.
స్టార్ ఇమేజ్, మెగా పాపులారిటీ ఉన్నప్పటికీ ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ చేస్తూనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నారట రామ్ చరణ్.

ఈ సారి ఓ కొత్త దర్శకుడు తీసుకొచ్చిన కథను రామ్ చరణ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆ దర్శకుడికి అనుభవం లేకున్నా సరే అనేశారట చెర్రీ. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని టాక్. ఇక చెర్రీ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నాను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











