రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. ఆ డైరెక్టర్‌పై కన్నేసిన మెగా వారసుడు! వర్కవుట్ అయ్యేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత సినిమా రంగస్థలంలో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన ఆయన.. RRR రూపంలో భారీ బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే దీని తర్వాత చేయబోయే సినిమాపై కూడా రామ్ చరణ్ సన్నాహాలు మొదలు పెట్టేశారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ యంగ్ డైరెక్టర్ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. వివరాల్లోకి పోతే..

ఆలస్యమవుతున్న RRR.. రాజమౌళి సూచన

ఆలస్యమవుతున్న RRR.. రాజమౌళి సూచన

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న RRR మూవీ అనుకున్న దానికంటే ఆస్యమవుతోంది. ఈ మేరకు ఇటీవలే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు తమ తమ తర్వాతి ప్రాజెక్ట్స్ పై కూడా ఫోకస్ పెట్టుకోవచ్చిని చెప్పారట. దీంతో ఇటు RRR షూటింగ్ చేస్తూనే తదుపరి సినిమాల గురించిన వర్క్స్ మొదలెట్టాశారు ఈ యంగ్ హీరోస్.

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్..

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్..

ఈ మేరకు ఇప్పటికే తన తదుపరి సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కన్ఫర్మ్ చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది. ఇక రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ రాకపోవడంతో మెగా అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

 ఆలోచనలో పడిన మెగా పవర్ స్టార్..

ఆలోచనలో పడిన మెగా పవర్ స్టార్..

ఈ విషయం గమనించిన రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను సెట్ చేసుకునే పనిలో పడ్డారట. ఇందులో భాగంగా కొందరు దర్శకులు చెప్పే కథలు వింటున్నాడు చెర్రీ. ఇప్పటికే హరీష్ శంకర్, సుజీత్, గౌతమ్ తిన్ననూరి, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు చరణ్‌ను కలిసి తమ తమ కథలు వినిపించగా వాటి విషయంలో ఆలోచనలో ఉన్నారట మెగా పవర్ స్టార్.

టాలీవుడ్‌లో సంచలనం.. ఆయనపైనే చెర్రీ కన్ను

టాలీవుడ్‌లో సంచలనం.. ఆయనపైనే చెర్రీ కన్ను

అయితే వీళ్లందరిలో అనిల్ రావిపూడి స్టోరీ లైన్ రామ్ చరణ్‌ని బాగా అట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో భారీ విజయంలో సొంతం చేసుకోవడంతో ఈ దర్శకుడి పేరు టాలీవుడ్‌లో మారుమోగుతోంది. ఎంటర్‌టైన్మెంట్ చేయడంలో ఇతన్ని మించి ఇంకెవరూ లేరనే టాక్ వినిపిస్తోంది. అందుకే RRR తర్వాత అనిల్ ఎంటర్‌టైన్మెంట్ తోనే తాను ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారట చెర్రీ.

Recommended Video

RRR First Look : The Best Fan Made Posters | RRR Poster Review | JR NTR | Ram Charan
రామ్ చరణ్ ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా?

రామ్ చరణ్ ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా?

మరోవైపు అనిల్ ఎఫ్ 3 రూపొందించాలని అనుకున్నారు. కానీ ఇందులో నటించనున్న వెంకటేష్ 'నారప్ప' సినిమాతో, వరుణ్ తేజ్ 'బాక్సర్' సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి.. ఈ లోగా ఆయనతో, తన సినిమాను లైన్ లోకి తీసుకొస్తే బెటర్ అని ప్లాన్ చేశారట చరణ్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి చరణ్, అనిల్ కాంబినేషన్ తెరరూపం దాల్చుతుందో.. లేదో! అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X