బూతుని 'యూత్' అన్న డైరక్టర్ తో రామ్ చరణ్ తేజ నెక్ట్స్
తమిళ దర్శకుడు ధరణితో మెరుపు చిత్రం ప్రారంబించిన రామ్ చరణ్ తేజ ఆ సినిమాని రకరకాల కారణాలతో ఆపేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ చిత్ర నిర్మాత ఎన్.వి.ప్రసాద్..దర్శకుడుని మార్చి ట్రై చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిత్రం ఏమైంది ఈ వేళ తో హిట్ కొట్టిన సంపత్ నందిని సీన్ లోకి తీసుకు వచ్చారు. రీసెంట్ గా సంపత్ నంది ఓ కథని రామ్ చరణ్ కి నేరేట్ చేయటం, అది వెంటనే నచ్చటం జరిగింది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని తెలుస్తోంది. చిరంజీవి కూడా కథ విని ఆమోద ముద్ర వేయటమే మిగిలిందని చెప్తున్నారు. రామ్ చరణ్ ఓకే చేయటంతో రెట్టించిన ఉత్సాహంతో సంపత్ నంది ఆ స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని అయినా మొదటి చిత్రం ఏమైంది ఈ వేళలా బూతు కలపకుండా చేస్తాడని ఆశిద్దాం. ఇంతకీ ఈ కొత్త చిత్రం టైటిల్ రచ్చ కాదో తెలియాలి.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ భాస్కర్ చిరంజీవి మగధీర మెరుపు ram charan teja sampath nandi bhaskar magadheera


Click it and Unblock the Notifications











