For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ని ప్రక్కన పెట్టి రామ్ చరణ్ తోనే...

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలుగులో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తన తదుపరిచిత్రాన్ని ఎన్టీఆర్ తో చేస్తారా లేక రామ్ చరణ్ తో చేస్తారా అనేది అందరిలో రకరకాల సందేహాలు ఉన్నాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తోనే చెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై నిర్మాత,మిగతా సాంకేతిక నిపుణల సమాచారంతో కూడిన పూర్తి ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

    ఇక ప్రస్తుతం త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో ఆయనకీ రోల్ చేస్తున్నారు. త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ చిత్రాల ద్వారా స్టార్ గా ఎదిగిన బొమన్ ఇరాని వెర్సటైల్ ఆర్టిస్టు. ఆయన్ను తెలుగులోకి ఓ మంచి పాత్ర ద్వారా పరిచయం చేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో క్షణక్షణం ద్వారా పరేష్ రావెల్ తెలుగులోకి వచ్చినట్లే బొమన్ ఇరాని కూడా ఇలా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పాపులర్ కానున్నారు.

    ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రానికి నిర్మాత. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఈ చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట.

    ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగు స్పెయిన్లో ప్లాన్ చేసారు. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.

    ఈ చిత్రానికి సరదా', 'హరే రామ హరే కృష్ణ' టైటిల్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే.... తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికారికంగా ఖరారు అయితే తప్ప దీన్ని నమ్మలేం.

    English summary
    This is the hottest news doing the rounds in the industry, it looks like a film in the combination of director Trivikram Srinivas and actor Ram Charan has been finalized. And this film is going to be the next film of Ram Charan once he completes his current assignments. Trivikram Srinivas is currently busy directing Pawan Kalyan in an untitled film where as Ram Charan is busy wrapping up two of his upcoming films Yevadu and Zanjeer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X