twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1500 కోట్ల ప్రాజెక్ట్ నుంచి రాంచరణ్ అవుట్.. అల్లు అరవింద్‌కు షాక్

    |

    తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం దేశవ్యాప్తంగా ఊపందుకొన్నది. ఈ క్రమంలోనే తెలుగుతోపాటు పలు భాషల్లో భారీ బడ్జెట్‌తో రామాయణ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా విషయంలో రాంచరణ్ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇంతకు ఆ వార్త ఏమిటంటే..

     రాంచరణ్ నిర్ణయంతో

    రాంచరణ్ నిర్ణయంతో

    రామయణ చిత్రం కోసం అల్లు అరవింద్‌తో బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా, మధు మంతెన జతకట్టారనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గతేడాది ఈ చిత్రంలో రాంచరణ్ కీలక పాత్రను పోషిస్తారనే అంశంతో పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. అయితే ఈ సినిమా విషయంలో రాంచరణ్ తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకొన్నట్టు సమాచారం. అందుకు కారణం RRR మూవీ కారణమని వినిపిస్తున్నది.

     పౌరాణిక పాత్రలో చేయడం గురించి

    పౌరాణిక పాత్రలో చేయడం గురించి

    తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కనున్న రామాయణ చిత్రంలో రాముడిగా రాంచరణ్ నటిస్తున్నట్టు అల్లు అరవింద్ పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను రాముడిగా నటించే ఛాన్స్ లేదని నిర్మాత అల్లు అరవింద్‌కు చెప్పినట్టు తెలిసింది. పౌరాణిక పాత్రలో నటించే విషయాన్ని ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు వెల్లడించనట్టు సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. దాంతో నిర్మాతలు మరో హీరో కోసం వేటలో పడినట్టు తెలుస్తున్నది.

     RRR మూవీ కారణంగానే

    RRR మూవీ కారణంగానే

    అయితే RRR మూవీ షూటింగ్ బిజీ కారణంగానే రాంచరణ్ తప్పుకొంటున్నట్టు ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకులు, దంగల్ ఫేం నితీష్ తివారీ, మామ్ ఫేం రవి ఉదయవార్ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రాసెస్‌లో ఉంది. సీతగా నయనతార నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    RRR మూవీ రిలీజ్ గురించి

    RRR మూవీ రిలీజ్ గురించి

    ఇక RRR చిత్రం 1800 కాలం నాటి కథా నేపథ్యంతో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించబోతున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.

    English summary
    Ace Producer Allu Aravind planning big project Ramayana, which will be directed by Nitesh Tiwari and Ravi Udyawar. Reports suggest that, Ram Charan was offered to play the role of Lord Ram in expensive Telugu film Ramayana. But, he rejected the film for Rajamouli's RRR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X