‘చిరంజీవి’ అనే పదం తొలగించాలని రామ్ చరణ్ కోరాడట.. ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ చిత్రంలోని ఓ పాటలోని పదంపై చరణ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

'సైరా' పాటలను ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. అయితే ఓ పాటలో 'చిరంజీవి' అనే పదం ఉండటం రామ్ చరణ్‌కు నచ్చలేదని, దాన్ని తొలగించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆ పదం వెనక అర్థం వేరు, కానీ...

ఆ పదం వెనక అర్థం వేరు, కానీ...

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా ‘సైరా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉయ్యాలవాడను పొగుడుతూ రాసిన ఓ పాటలో చిరంజీవి అనే పదం సందర్భానుసారంగా వాడాల్సి వచ్చిందట... అది అభిమానులకు కూడా మంచి కిక్ ఇచ్చే పదం కావడంతో ఆ పదం వాడినట్లు సమాచారం.

ఆ కారణంగానే తొలగించమన్నారా?

ఆ కారణంగానే తొలగించమన్నారా?

అయితే చిరంజీవి పదం వాడటం వల్ల సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుందనే అభిప్రాయం రామ్ చరణ్ వ్యక్తం చేశారని, దాని వల్ల రేపు ఏమైనా విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో దాన్ని తొలగించాలని కోరినట్లు టాక్.

నిజం ఎంత?

నిజం ఎంత?

‘సైరా' లాంటి పెద్ద ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నపుడు... సినిమా గురించి రకరకాల పుకార్లు షికారు చేస్తూనే ఉంటాయి. గతంలోనూ పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. అదే కోవలో ‘చిరంజీవి' పదం రామ్ చరణ్ తొలగించమన్నారు అనే వార్త చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

‘సైరా నరసింహారెడ్డి'లో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తుండగా... ఆయన భార్య పాత్రలో నయనతార నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X