బయటపడ్డ RRR సీక్రెట్.. రాజమౌళి ఆలోచనకు ఎన్టీఆర్, రామ్ చరణ్ సై అనడంతో!

1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల కానుంది.

ఆ రోజు నుంచీ వర్కింగ్ టైటిల్ తోనే..

ఆ రోజు నుంచీ వర్కింగ్ టైటిల్ తోనే..

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా RRR సినిమా రూపొందిస్తున్నానని పేర్కొన్న రాజమౌళి.. ఆ సినిమా నటీనటుల వివరాలు కూడా తెలిపారు. RRR అనే వర్కింగ్ టైటిల్ మీదనే గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా RRR పైనే ఇస్తూ వస్తోంది చిత్రయూనిట్. ఈ తరుణంలో తాజాగా టైటిల్ విషయమై ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

RRR సరిపోయేలా సూపర్ టైటిల్

RRR సరిపోయేలా సూపర్ టైటిల్

RRR అనే వర్కింగ్ టైటిల్‌కి సరిపోయే డెఫినేషన్ ఇవ్వండి అని కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రకటనపై రియాక్ట్ అయిన చాలా మంది నెటిజన్లు `RRR`కు స‌రిపోయేలా చాలా ర‌కాల టైటిల్స్‌ను చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ టైటిల్స్ ఫిల్టర్ చేసే పనిలో చిత్రయూనిట్ ఉందని తెలుస్తోంది.

రాజమౌళి ఆలోచనకు ఎన్టీఆర్, రామ్ చరణ్ సై

రాజమౌళి ఆలోచనకు ఎన్టీఆర్, రామ్ చరణ్ సై

అలా వచ్చిన టైటిల్స్‌లో ఒక టైటిల్ పై రాజమౌళి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు సమాచారం. `రామ‌ రౌద్ర రుషితం` అనే టైటిల్ రాజమౌళికి బాగా నచ్చేసిందట. సో ఇదే కన్ఫర్మ్ చేసేద్దామని ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చెప్పినట్లుగా ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. దీనిపై ఆ ఇద్దరు యంగ్ హీరోలు కూడా సుముఖత వ్యక్తం చేశారనేది తాజా సమాచారం.

ఇదొక్కటే కాదు..

ఇదొక్కటే కాదు..

తెలుగు పాటు ఇతర భాషల్లోనూ భారీ రేంజ్ లో విడుదల కానుంది RRR మూవీ. సో ద‌క్షిణాదిన `రామ‌రౌద్ర రుషితం` అనే టైటిల్‌, ఇత‌ర భాష‌ల్లో `రైజ్ రివోల్ట్ రివేంజ్‌` అనే టైటిల్‌ పెట్టి సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనకు వచ్చారట రాజమౌళి. త్వ‌ర‌లోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎన్టీఆర్ ఇలా.. రామ్ చరణ్ అలా

ఎన్టీఆర్ ఇలా.. రామ్ చరణ్ అలా

'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్టు కావడంతో RRR పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అలరించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X