రామ్ చరణ్ ‘ఆరెంజ్’ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్....
ఆరెంజ్ సినిమాని ఓ ఛాలెంజ్ గా తీసుకున్నానంటోంది హీరోయిన్ జెనీలియా. చరణ్ సరసన కొత్తగా కన్సించడం కోసం లుక్ బాగా మార్చేశానని చెబుతోన్న జెనీలియా, 'బొమ్మరిల్లు" సినిమాలో హాసిని పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ అనీ, 'ఆరెంజ్", 'బొమ్మరిల్లు"కు మించిన గుర్తింపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 'ఆరెంజ్" లో చరణ్ చాలా క్యూట్ గా వుంటాడనీ, చరణ్ కన్నా క్యూట్ గా తాను కన్సిస్తానని జెనీలియా చెబుతోంది.
ఇక, 'మగధీర" తర్వాత చరణ్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో, అందరికన్నా ఎక్కువ టెన్షన్ తాను ఫీలయ్యాననీ, 'ఆరెంజ్" సినిమాలో చరణ్ లుక్ వైజ్ చాలా బావుంటాడని అంటున్నాడు దర్శకుడు భాస్కర్. 'ఆరెంజ్" సినిమా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ గా అభివర్ణించిన భాస్కర్, తెలుగు సినీ పరిశ్రమలో 'ఆరెంజ్" ఓ ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోతుందని చెబుతున్నాడు. ఛాలెంజింగ్ గా తీసుకుని 'ఆరెంజ్" సినిమా తాను తెరకెక్కించాననీ, ఓ వీరాభిమానిగా చరణ్ ని ఎలా చూడాలనుకుంటున్నానో అలానే 'ఆరెంజ్" లో చూపించానని 'ఆరెంజ్" ఆడియో విడుదల వేడుకలో చెప్పుకొచ్చాడు భాస్కర్.


Click it and Unblock the Notifications











