రామ్ చరణ్ 'ఆరెంజ్' కి రికార్డు స్ధాయిలో శాటిలైట్ రేట్?

By Srikanya

రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆరెంజ్'..ఆ రేంజే వేరు చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం బాగా పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ ఛానెల్ వారు ముందడగు వేసి ఎన్నడూ లేని విధంగా ఆరున్నర కోటిని కోట్ చేసారని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని మా టీవీకే శాటిలైట్ రైట్స్ ఇద్దామనుకున్న నిర్మాత నాగబాబు దాంతో మరోసారి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మగధీర తర్వాత రిలీజవుతున్న చిత్రం కావటం, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం ఈ చిత్రంపై క్రేజ్ కలిగిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొన్నే రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుని ఇండియా వచ్చిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయన్ గా చేస్తోంది. ఆమెతో పాటు షజాన్ పదమ్సి(Shazahn Padamsee), సంచితా షెట్టి లీడ్ రోల్స్ చేస్తున్నారు. నాగేంద్రబాబు తన అంజనా ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కె.వెంకట్రావు సమర్పించే ఈ చిత్రం దసరా కానుకగా పండగ రోజులు కలిసి వచ్చేటట్లు ఉండాలని రిలీజ్ నిర్ణయించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ తాజాగ ధరణి దర్శకత్వంలో 'మెరుపు' అనే చిత్రం చేయటానికి కమిట్ అయ్యారు. అలాగే ఈ శాటిలైట్ డీల్ ఓకే అయితే ఇదే రికార్డు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X