For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పవన్-వెంకటేష్ మూవీలో చెర్రీ ఐటం సాంగ్..?(ఫొటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో అక్షయ్ కుమార్-పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, తెలుగులో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

  హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన లార్డ్ కృష్ణా పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించనున్నాడు. పరేష్ రావల్ పాత్రలో వెంకటేష్ నటించనున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తారనే ఓ వార్త కూడా తాజాగా ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చింది.

  ఇంతే కాకుండా మరో హాట్ న్యూస్ కూడా ప్రాచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో ఐటం సాంగ్ (స్పెషల్ నెంబర్) చేయించానికి పిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

  రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ ఎందుకు?

  రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ ఎందుకు?


  సినిమాకు హైప్ తెచ్చేందుకే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగులో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది.

  తెలుగులో ఇదే భారీ మల్టీస్టారర్ కాబోతోందా?

  తెలుగులో ఇదే భారీ మల్టీస్టారర్ కాబోతోందా?


  ఈ చిత్రం తెలుగులో భారీ మల్టీస్టారర్ కాబోతోందా? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లషకులు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించడంతో పాటు రామ్ చరణ్ కూడా స్పెషల్ సాంగు చేయడం, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాను ఓ రేంజికి తీసుకెలుతుందని అంటున్నారు.

  తెలుగు టైటిల్

  తెలుగు టైటిల్


  హిందీలో ‘ఓ మై గాడ్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓ దేవుడా' అనే టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఈ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించారు.

  పవన్ రెమ్యూనరేషన్ ఎంత?

  పవన్ రెమ్యూనరేషన్ ఎంత?


  ఈ చిత్రానికి పవన్ డబ్బు రూపంలో ఏమీ రెమ్యునేషన్ తీసుకోవటం లేదు. మరి ఫ్రీ గా చేస్తున్నాడా అంటే కాదు.. బిజినెస్ షేర్ అడిగారుట. నైజాం,సీడెడ్,ఆంధ్రాలలో ఎక్కడో చోట రైట్స్ ని రెమ్యునేషన్ గా తీసుకుంటారని చెప్తున్నారు.

  నిర్మాణ సంస్థలు

  నిర్మాణ సంస్థలు


  బాలీవుడ్ మూవీ ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కబోతున్న ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

  పవన్-వెంకీ

  పవన్-వెంకీ


  పవన్ కళ్యాణ్, వెంకటేష్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ ఎప్పటి నుండో కలిసి పని చేయాలనుకుంటున్నారు. అయితే ఇద్దరిక నచ్చే విధంగా కథలు దొకరక పోవడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ మూవీ ఖరారు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  డాలి దర్శకత్వంలో...?

  డాలి దర్శకత్వంలో...?


  తెలుగులో కొంచెం ఇష్టం కంచె కష్టం, తడాఖా చిత్రాలకు దర్శకత్వం వహించిన డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. అయితే దర్శకుడిగా అతన్నే తీసుకోవాలా? వద్దా? అనే దానిపై క్లారిటీ రాలేదు.

  ‘ఓ మై గాడ్' కథ ఏమిటి?

  ‘ఓ మై గాడ్' కథ ఏమిటి?


  'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

  పవన్ ఫ్రెండ్ శరత్ మరార్

  పవన్ ఫ్రెండ్ శరత్ మరార్


  నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ అధినేత మరెవరో కాదు...పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్.

  English summary
  Pawan Kalyan and Venkatesh multi starrer movie announced. They will be working together for the official remake of Bollywood’s ‘Oh My God’. Mega Power Star Ram Charan is going to jig in the movie for a special number. It is learnt that he will have Kajal Aggarwal to shake a leg with him for a special song. Then it was Mahesh’s turn and he would be doing a voice over for the movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more