రామ్ చరణ్ దూకుడు.. ‘పెద్ది' తర్వాత మరో లెవెల్ ప్లాన్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే షూటింగ్ పనులు తుదిదశకు చేరుకోవడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక 'పెద్ది' పనులు దాదాపుగా పూర్తి కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వరుసగా భారీ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ, తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ లైనప్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

'పెద్ది' తర్వాత సుకుమార్ తో
రామ్ చరణ్ 'పెద్ది' తర్వాత RC17ని తెరకెక్కించే అవకాశముంది. ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించనున్నారనే విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మరింత పెద్ద స్కెల్‌లో, పాన్ ఇండియా స్థాయిలో సినిమా రూపొందించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ తన ప్రత్యేకమైన నెరేషన్ స్టైల్‌తో చరణ్‌ను మరో కొత్త కోణంలో చూపిస్తాడనే ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరుగుతోంది.

Ram Charan Peddi Release Buzz RC17 with Sukumar amp amp RC18 Plans Excite Mega Fans Big

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రంగంలోకి?
ఇక RC17 తర్వాత చరణ్ 18వ సినిమా ఎవరితో చేస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ చాలా కాలంగా చరణ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కల నిజం కావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే నాగవంశీ పలువురు స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్ట్స్ నిర్మించి సక్సెస్ సాధించారు.ఒకవేళ రామ్ చరణ్‌తో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే, అది సితార బ్యానర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది ఇంకా ఖరారు కాలేదు.

గౌతమ్ తిన్నానూరి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి పేర్లు వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే ఇటీవల చరణ్ బాలీవుడ్ దర్శకులతో కూడా పని చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన టాలీవుడ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సుకుమార్‌తో సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత సితార బ్యానర్‌లో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మెగా స్ట్రాటజీ క్లియర్!
ఇప్పటికే 'పెద్ది'తో పాన్ ఇండియా ఇంపాక్ట్ క్రియేట్ చేసి, వెంటనే RC17, RC18తో మార్కెట్‌ను మరింత విస్తరించడానికి స్ట్రాటజీ చరణ్ ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవైపు స్టార్ డైరెక్టర్, తిరిగి టాప్ ప్రొడక్షన్ హౌస్‌లతో కాంబినేషన్స్ సెట్ చేస్తూ, తన కెరీర్‌ను మరింత హైలెవెల్‌కు తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నాడు. ఇలా వరుసగా భారీ ప్రాజెక్టులు లైన్‌లో ఉండటంతో, మెగా ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌కి చేరుకుంది. ఇక ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు ఎప్పుడు వస్తాయన్నదే ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X