PEDDI: రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్! ఇక థియేటర్లలో పూనకాలే!
Ram Charan Peddi Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబోలో రాబోతోన్న విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది (Peddi). ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామా విడుదల తేదీపై తాజాగా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని భావించినా.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ మూవీ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పెద్ది సినిమా విడుదల ఎప్పుడు?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇక ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పెద్ది సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఒక్క స్పెషల్ సాంగ్ మినహా మిగతా టాకీ పార్ట్ పూర్తయిందని తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా చరణ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్, VFX వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. భారీ విజువల్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రతి అంశంపై టీమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.
స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్ ?
'పెద్ది'లో స్పెషల్ సాంగ్‌పై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాట కోసం ముందుగా పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినా.. చివరకు శృతి హాసన్ ను ఎంపిక చేసినట్లు టాక్. గతంలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా కనిపించే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.
రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?
గత కొద్ది రోజులుగా 'పెద్ది' జూన్ మొదటి వారం లేదా చివరి వారంలో వస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతుండటంతో జూన్ 4 రిలీజ్ కష్టమని తెలుస్తోంది. దీంతో జూన్ 25 తేదీని మేకర్స్ లాక్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని జూన్ 24 అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పూర్తి స్థాయి మాస్ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గ్రామీణ నేపథ్యం, ఎమోషన్స్, స్పోర్ట్స్ యాక్షన్, చరణ్ మాస్ ఇమేజ్ అన్ని కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ది విడుదల జూన్ 25 అని వినిపిస్తున్నప్పటికీ.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రిలీజ్ డేట్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకసారి డేట్ కన్ఫర్మ్ అయితే.. 'పెద్ది' ప్రమోషన్స్ మరింత జోరుగా మొదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications