Peddi: రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఇంత కష్టపడ్డారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ సినిమాల కోసం, తమ పాత్రల కోసం ఎలా కష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు వాళ్ల డెడికేషన్ ఒక స్థాయిని దాటి, పాత్రకే ప్రాణం పోసే స్థాయికి చేరుతుంది. అలాంటి అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రాన్స్‌ఫార్మేషన్. చరణ్ పెద్ది (Peddi) సినిమా కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ట్రాన్స్ ఫార్మేషన్ వేరే లెవల్. లీన్ క్రికెటర్ లుక్ నుంచి బలమైన దేశీ పహల్వాన్‌గా మారిన ఆయన ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చగా మారింది. అసలు విషయం తెలిస్తే రామ్ చరణ్ ఇంత కష్టపడ్డరా? అనకుండా ఉండలేరు.

Also Read
'నన్ను వేధించినా నా పోరాటం ఆగదు!' జబర్దస్త్ రష్మి స్ట్రాంగ్ కౌంటర్
'నన్ను వేధించినా నా పోరాటం ఆగదు!' జబర్దస్త్ రష్మి స్ట్రాంగ్ కౌంటర్

దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ సినిమాను అత్యంత రియలిస్టిక్‌గా రూపొందిస్తున్నాడు. పాత్ర డిమాండ్ మేరకు చరణ్ బాడీ కూడా సహజంగా, సాంప్రదాయ కుస్తీ యోధుడిలా కనిపించాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే "గ్రీక్ గాడ్" స్టైల్ బాడీ కాకుండా, మట్టి వాసన ఉన్న పహల్వాన్ ఫిజిక్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్లాన్ చేశారు. ఈ ప్రాసెస్ సాధారణంగా కొన్ని నెలల్లో పూర్తయ్యేది కాదు. దాదాపు ఒక సంవత్సరం నాలుగు నెలల పాటు కఠినమైన శిక్షణతో చరణ్ తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నారట.

Recommended For You
Patriot Day 2 Collections: పేట్రియాట్‌ 2వ రోజు కలెక్షన్స్.. మోహన్‌లాల్- మమ్ముట్టి మూవీకి ఎన్ని కోట్లంటే?
Patriot Day 2 Collections: పేట్రియాట్‌ 2వ రోజు కలెక్షన్స్.. మోహన్‌లాల్- మమ్ముట్టి మూవీకి ఎన్ని కోట్లంటే?
Ram Charan Peddi Transformation Secrets Behind His Powerful Pehlwan Body Revealed

రామ్ చరణ్ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న శ్రమ చూస్తే అది ఒక యోధుడి ప్రిపరేషన్‌లా ఉంటుంది. వారంలో మూడు రోజులు హెవీ వెయిట్ ట్రైనింగ్‌తో పాటు ఫాస్టింగ్ కార్డియో చేయగా, మిగతా రోజుల్లో ఫంక్షనల్ ట్రైనింగ్, మొబిలిటీ ఎక్సర్‌సైజులు, కుస్తీ డ్రిల్స్ చేశారట. ముఖ్యంగా గదతో వ్యాయామం, తాడు లాగడం, సూర్య నమస్కారాలు, అఖాడా స్టైల్ ట్రైనింగ్ వంటి సాంప్రదాయిక విధానాలను కూడా రూటీన్‌లో భాగం చేశారు. ఈ విధానం వల్ల శరీరానికి కేవలం మసిల్స్ మాత్రమే కాకుండా రా పవర్, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుందట.

You May Also Like
మాది దేవుడిచ్చిన బంధం.. కళ్యాణ్ పడాల‌తో నా రిలేషన్ ఇదే..
మాది దేవుడిచ్చిన బంధం.. కళ్యాణ్ పడాల‌తో నా రిలేషన్ ఇదే..

ఇక డైట్ విషయంలో కూడా చరణ్ అసాధారణ క్రమశిక్షణ పాటించారు. ఇప్పటికే వెజిటేరియన్ డైట్‌కు అలవాటు ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం పూర్తిగా కంట్రోల్డ్ ఫుడ్ ప్లాన్ ఫాలో అయ్యారు. రోజుకు 1800 నుంచి 2500 క్యాలరీల మధ్య కార్బ్ సైక్లింగ్ చేస్తూ, అవసరాన్ని బట్టి క్యాలరీ డెఫిసిట్ కూడా పాటించారట. సినిమా ప్రారంభంలో కనిపించే లీన్ లుక్ కోసం కొన్ని నెలలు తక్కువ క్యాలరీలు తీసుకుని బాడీని స్లిమ్ చేశారు. ఆ తర్వాత క్రమంగా మసిల్ బిల్డింగ్‌పై ఫోకస్ పెట్టారు. షూటింగ్ సమయంలో కూడా ఉదయం 4 గంటలకే లేచి ట్రైనింగ్ చేయడం, కారులోనే ఫస్ట్ మీల్ తీసుకునేవారంట.

'నేను రొమాంటిక్... నాకు అలాంటి అబ్బాయిలంటే ఇష్టం!'
'నేను రొమాంటిక్... నాకు అలాంటి అబ్బాయిలంటే ఇష్టం!'

ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం చరణ్ భారీగా ఖర్చు పెట్టినట్టు కూడా సమాచారం. ప్రత్యేక కోచ్‌లను నియమించుకుని, పర్ఫెక్ట్ బాడీ కోసం ఎలాంటి రాజీ పడకుండా పనిచేశాడు. పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని పూర్తిగా మార్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లాడు. ఈ స్థాయి కమిట్‌మెంట్ చూసి దర్శకుడు కూడా ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఒంటినిండా మట్టి, గట్టిగా పెరిగిన గడ్డం, చేతిలో గదతో నడిచే చరణ్ లుక్ చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కళ్లలో కనిపించే ఆగ్రహం, బాడీలోని రఫ్‌నెస్ అన్ని కలిపి ఒక నిజమైన కుస్తీ యోధుడి ఫీలింగ్‌ను ఇస్తున్నాయి. "కుస్తీ అంటే ఆట కాదు... ప్రాణాల మీద పెట్టే యుద్ధం" అనే డైలాగ్ ఈ సినిమాకి ఉన్న ఇంటెన్సిటీని మరింత ఎలివేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జూన్ 4 న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తోందో వేచి చూడాలి.

Read more about: buchi babu sana ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X