twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుకుమార్‌కి కాల్ చేసిన రామ్ చరణ్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో పని చేయాలని కోరుకుంటున్నాడు. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కథ చెప్పడానికి రమ్మంటూ సుకుమార్‌కి రామ్ చరణ్ కాల్ చేసినట్లు సమాచారం.

    ఆ మధ్య రామ్ చరణ్... సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1-నేనొక్కడినే' చిత్రం తనకు చాలా బాగా నచ్చిందని ప్రశంసించాడు. టాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. ఆయన కొత్త ఐడియాస్, సరికొత్త కాన్సెప్టులు నాకు బాగా నచ్చుతాయి. అల్లు అర్జున్‌‌తో సుకుమార్ చేసిన సినిమాలన్నీ నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన ‘1-నేనొక్కడినే' చిత్రం చాలా బాగా నచ్చింది. అదొక మంచి చిత్రం. ఆయన ‘1-నేనొక్కడినే' లాంటి సరికొత్త కాన్సెప్టు గల సినిమాలు మరిన్ని తీయాలని రామ్ చరణ్ ఆకాంక్షించాడు.

    రామ్ చరణ్ సినిమాల తాజా సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. రామ్ చరణ్ చేసిన తొలి ఫ్యామిలీ ఎంటర్టెనర్ సినిమా ఇది. అయితే ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ చిత్రం నిర్మాతకు నష్టాలు మిగిల్చింది, రామ్ చరణ్ రూ. 3 కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చాడని అంటున్నారు.

    Ram Charan planning to hear Sukumar’s story

    రామ్ చరణ్ తర్వాతి సినిమాల విషయానికొస్తే... ఆయన ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. కథలు వింటున్నారు. శ్రీను వైట్లతో అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో ఆ ప్రాజెక్టు అటెక్కింది. మరో వైపు బోయపాటి స్టోరీ కూడా విన్నట్లు సమాచారం. త్వరలో బోయపాటితోగానీ, సుకుమార్‌తో గానీ సినిమా ప్రకటించే అవకాశం ఉంది.

    ‘2015లో గౌతం మీనన్ దర్శకత్వంలో డైరెక్ట్ తమిళ సినిమా చేయాలనుకుంటున్నాడు రామ్ చరణ్. ఘర్షణ, ఏమాయ చేసావె, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాల ద్వారా గౌతం మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాస్తవికత ఉట్టిపడేలా, వైవిద్యంగా సినిమాలు తీయడం గౌతం మీనన్ స్టైల్. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ తమిళ సినిమా చేస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.

    English summary
    Acording to sources is Mega star Ram Charan planning to hear Sukumar’s story. Currently Sukumar is venturing into production also.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X