Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సుకుమార్‌కి కాల్ చేసిన రామ్ చరణ్?
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో పని చేయాలని కోరుకుంటున్నాడు. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కథ చెప్పడానికి రమ్మంటూ సుకుమార్‌కి రామ్ చరణ్ కాల్ చేసినట్లు సమాచారం.
ఆ మధ్య రామ్ చరణ్... సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1-నేనొక్కడినే' చిత్రం తనకు చాలా బాగా నచ్చిందని ప్రశంసించాడు. టాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. ఆయన కొత్త ఐడియాస్, సరికొత్త కాన్సెప్టులు నాకు బాగా నచ్చుతాయి. అల్లు అర్జున్‌తో సుకుమార్ చేసిన సినిమాలన్నీ నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన ‘1-నేనొక్కడినే' చిత్రం చాలా బాగా నచ్చింది. అదొక మంచి చిత్రం. ఆయన ‘1-నేనొక్కడినే' లాంటి సరికొత్త కాన్సెప్టు గల సినిమాలు మరిన్ని తీయాలని రామ్ చరణ్ ఆకాంక్షించాడు.
రామ్ చరణ్ సినిమాల తాజా సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. రామ్ చరణ్ చేసిన తొలి ఫ్యామిలీ ఎంటర్టెనర్ సినిమా ఇది. అయితే ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ చిత్రం నిర్మాతకు నష్టాలు మిగిల్చింది, రామ్ చరణ్ రూ. 3 కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చాడని అంటున్నారు.
రామ్ చరణ్ తర్వాతి సినిమాల విషయానికొస్తే... ఆయన ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. కథలు వింటున్నారు. శ్రీను వైట్లతో అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో ఆ ప్రాజెక్టు అటెక్కింది. మరో వైపు బోయపాటి స్టోరీ కూడా విన్నట్లు సమాచారం. త్వరలో బోయపాటితోగానీ, సుకుమార్‌తో గానీ సినిమా ప్రకటించే అవకాశం ఉంది.
‘2015లో గౌతం మీనన్ దర్శకత్వంలో డైరెక్ట్ తమిళ సినిమా చేయాలనుకుంటున్నాడు రామ్ చరణ్. ఘర్షణ, ఏమాయ చేసావె, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాల ద్వారా గౌతం మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాస్తవికత ఉట్టిపడేలా, వైవిద్యంగా సినిమాలు తీయడం గౌతం మీనన్ స్టైల్. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ తమిళ సినిమా చేస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.