విజయ్ సేతుపతి - రవితేజ.. హై వోల్టేజ్ కాంబినేషన్ సెట్ చేస్తున్న రామ్ చరణ్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా బిగ్గెస్ట్ కాంబినేషన్స్ సెట్స్ పైకి వస్తున్నాయి. ఒకదానికి మించి మరొక సినిమాను రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని హై వోల్టేజ్ కథలు రాబోతున్నాయి. రవితేజ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ ఒకే కథలో నటిస్తే హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ కాంబోను సెట్ చేయడానికి ఒక హీరో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)

మాస్టర్ సినిమాతోనే
విజయ్ సేతుపతికి కేవలం తమిళ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ దర్శకులు కూడా అతనీతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. మాస్టర్ సినిమా తెలుగులో ఆ స్థాయిలో హిట్టవ్వడానికి ప్రధాన కారణం సేతుపతికి ఉన్న క్రేజ్ అనే చెప్పాలి.

రవితేజతో సినిమా
మాస్టర్ అనంతరం ఉప్పెన సినిమాతో ఈ టాలెంటెడ్ నటుడి స్థాయి మరింత పెరిగింది. హీరోగా చేసిన సినిమాలు కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తమిళ్ లో కొన్ని పవర్ఫుల్ సినిమాలతో సిద్దమవుతున్న విజయ్ సేతుపతి త్వరలోనే రవితేజతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
షర్ట్ బటన్ విప్పేసి షాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్

సెట్ చేస్తున్న రామ్ చరణ్
మాస్ మహారాజ రవితేజ లాంటి స్టార్ హీరోతో విజయ్ సేతుపతి కలిసి నటిస్తే సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవు. ఇక వీరిద్దరిని కలిసి సినిమాను నిర్మించేది హీరో రామ్ చరణ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. ఇక వీరితో చేయబోయే సినిమా మలయాళం రీమేక్ అని తెలుస్తోంది.

మొదట పవన్ తో అన్నారు
2019లో విడుదలైన మలయాళం డ్రైవింగ్ లైసెన్స్ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అందులో పృథ్వి రాజ్, సూరజ్ వెంజరమూడు నటించారు. ఇక ఆ సినిమాను చూసిన వెంటనే రామ్ చరణ్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. మొదట పవన్ కళ్యాణ్ తో అలాగే మరొక హీరోతో రీమేక్ చేయనున్నట్లు టాక్ వచ్చింది.

అసలు కథ ఏమిటంటే
ఇక ఇప్పుడు చరణ్ దాన్ని రవితేజ- విజయ్ సేతుపతి లాంటి హీరోలతో చేయాలని అనుకుంటున్నాడని సమాచారం. ఒక స్టార్ హీరో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రయత్నించే క్రమంలో... అభిమాని అయినటువంటి ఆర్టీవో ఆఫీసర్ నుంచి అవమానం ఎదురవుతుంది. ఆ తరువాత వాళ్లిద్దరూ ఏ విధంగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు అన్నదే అసలు కథ. రవితేజ ఆర్టీవో ఆఫీసర్ గా విజయ్ సేతుపతి ఒక స్టార్ సెలబ్రెటీ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











