రామ్ చరణ్ మెగా ప్లాన్.. ఏకంగా యంగ్ హీరోలందరినీ టార్గెట్! ఎవ్వరూ ఉహించి ఉండరు
మెగా ఫ్యామిలీ వారసుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఓ మెగా ప్లాన్ రచించాడని తెలుస్తోంది. ఇటు సినిమాల్లో, అటు సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చెర్రీ.. ఏకంగా యంగ్ హీరోలందరినీ టార్గెట్ చేస్తూ ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం? రామ్ చరణ్ స్కెచ్ ఏంటి? వివరాల్లోకి పోతే..

చిరంజీవి ఇంట్లో సీనియర్ హీరో హీరోయిన్లు.. మెగా మీట్
గత శని, ఆదివారాల్లో మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు జరిగాయి. మెగాస్టార్ సహా ఆ నాటి హీరో హీరోయిన్లంతా కలిసి తెగ సందడి చేశారు. 80's తారలంతా కలిసి ప్రతీ ఏటా చేసుకుంటున్న యూనియన్ పార్టీకి ఈ ఏడాది మెగాస్టార్ ఇల్లు వేదికయింది. ఈ వేడుకలో స్వయంగా మెగాస్టార్ అన్ని పనులు చూసుకొని ఆనాటి తారలతో ఎంజాయ్ చేశారు.

రామ్ చరణ్ ఎంటర్.. ఆయన కూడా
మెగా ఇంట జరిగిన ఈ రీ యూనియన్ పార్టీలో సీనియర్ తారలతో కలిసి రామ్ చరణ్ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. ఏకంగా 40 మంది సెలెబ్రిటీస్‌తో సందడి చేసాడు ఈ మెగా వారసుడు. ఈ నేపథ్యంలో ఈ పార్టీ, అందులో సీనియర్ తారల హంగామా చూశాక.. రామ్ చరణ్‌కి ఓ ఐడియా వచ్చిందట. తానూ తండ్రి బాటలోనే వెళ్లాలని ఆయన డిసైడ్ అయ్యారట.

ఏకంగా యంగ్ హీరోలందరినీ టార్గెట్ చేస్తూ
ఈ మేరకు తండ్రి చిరంజీవి ఆనాటి తారలను ఒక్కచోటికి చేర్చినట్లు గానే, తాను కూడా యంగ్ హీరోలందరినీ ఒక్క చోటుకు చేర్చి మెగా పార్టీ అరేంజ్ చేయాలని భావిస్తున్నారట రామ్ చరణ్. అనుకున్నట్లుగా అన్నీ కుదిర్తే వచ్చే ఏడాది నుంచి యంగ్ హీరో హీరోయిన్ల రీ యూనియన్ పార్టీలు ప్రారంభించాలని చూస్తున్నారట చెర్రీ.

మెగా, నందమూరి అభిమానుల్లో ఆసక్తి
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తున్నాడు చెర్రీ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై మెగా, నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recommended Video

మరోసారి తండ్రి సినిమాకు నిర్మాతగా
మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు రామ్ చరణ్. ఈ బ్యానర్ పై ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించిన ఈయన.. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానున్న కొరటాల- చిరంజీవి కాంబో సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











