శంకర్ సినిమా నుంచి మరో లీక్.. కెరీర్ లో ఫస్ట్ టైం అలా కనిపిస్తున్న రామ్ చరణ్!

వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటించగా ఆయన అలియా సరసన సీత పాత్రలో నటించింది. ఇక ఆ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే ఒక అద్భుతమైన మైలురాయి సినిమాగా నిలిచిపోయింది.

ఆ సినిమా విడుదలైన కొద్దిరోజులకే విడుదలైన ఆచార్య సినిమా మాత్రం రామ్ చరణ్ కు నిరాశ కలిగించింది అనే చెప్పాలి. చిరంజీవితో మొట్టమొదటిసారి పూర్తిస్థాయి పాత్రలో నటించాడు అని మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. అయితే ఆ సినిమా ఫలితంతో పట్టింపు లేకుండా రామ్ చరణ్ వెంటనే శంకర్ సినిమా షూటింగ్ లో భాగం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది.

 Ram Charan playing a Negative Role in shankars film

ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయిందని చెబుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమా గురించి మరో లీక్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. ముందు ద్విపాత్రాభినయం అనుకున్నారు కానీ రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని ఒక తండ్రిగా ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు పోషిస్తున్నారని అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు కొడుకులలో ఒకరిది నెగిటివ్ పాత్రగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణ వ్యక్తి సివిల్ సర్వెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే మరో వ్యక్తి సంఘ విద్రోహ శక్తిగా ఎదుగుతాడు అని అంటున్నారు.

అలా అన్నదమ్ముల మధ్య గొడవ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ముగ్గురు మొనగాళ్లు సినిమా భారీ డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ విషయం మెగా ఫ్యాన్స్ కు అంత టెన్షన్ పెట్టే విధంగా ఉన్నా సరే శంకర్ దర్శకత్వంలో సినిమా కావడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని శంకర్ భావిస్తున్నాడు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి సినిమా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూడు పాత్రల ప్రచారం ఎంతవరకు అవుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X