RC16: బుచ్చిబాబు మూవీలో చరణ్ రోల్ లీక్.. అలాంటి పాత్ర చేస్తున్న తొలి హీరోగా!

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంటరైనా.. చాలా తక్కువ సమయంలోనే భారీ హిట్లను అందుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆరంభంలో కమర్షియల్ మూవీలు చేసిన అతడు.. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీలతో వచ్చి సక్సెస్‌లను సొంతం చేసుకున్నాడు. దీనికితోడు RRRతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా పేరును కూడా సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి మరింత జోష్‌తో మూవీలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు బుచ్చిబాబుతో మూవీ మొదలెట్టాడు. ఇందులో చరణ్ రోల్‌పై క్రేజీ న్యూస్ లీకైంది. అది మీకోసమే!

గేమ్ చేంజర్‌గా వస్తున్నాడు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. దీన్ని వచ్చే డిసెంబర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Ram Charan Plays RUNNER Role In Buchi Babu Sana Movie

బుచ్చిబాబుతో క్రేజీ ప్రాజెక్టు
'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ తన 16వ సినిమాను చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.

పాన్ ఇండియా స్టార్లు రెడీగా
పాన్ ఇండియా రేంజ్‌లో, హై రేంజ్ స్కేల్‌తో రాబోయే ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే, ఇందులో విలన్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఓ ముఖ్యమైన పాత్ర కోసం కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కూడా ఎంపిక చేసుకున్నారు.

పూజ పూర్తి.. షూట్ త్వరలో
యూనివర్శల్ సబ్జెక్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన సెటప్‌ను బుచ్చిబాబు సన వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్టును రెడీ చేయడంతో పాటు మిగిలిన అన్నింటినీ రెడీగా పెట్టుకున్నాడు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక, త్వరలోనే షూటింగ్‌ను సైతం మొదలు పెట్టబోతున్నారు.

Ram Charan Plays RUNNER Role In Buchi Babu Sana Movie

అలాంటి బ్యాగ్‌డ్రాప్‌తోనే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ సినిమా మాత్రం క్రీడలకు సంబంధించిన స్టోరీతోనే వస్తుందని చెబుతున్నారు.

రన్నర్‌గా చేస్తున్న చరణ్
ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎలాంటి పాత్రను చేస్తున్నాడు అన్న దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. ఇందులో ఈ మెగా హీరో 'రన్నర్' పాత్రను చేస్తున్నాడట. అంతర్జాతీయ స్థాయికి ఎదగాల్సిన అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనే నేపథ్యంతో ఈ మూవీ వస్తుందని టాక్. ఇదే నిజమైతే రన్నర్‌గా చేసిన తొలి స్టార్ హీరోగా చరణ్ నిలుస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X