రామ్ చరణ్ ’రచ్చ’ వాయిదా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, ఏమైంది ఈ వేళ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో "రచ్చ" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 60% సూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల చైనాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ రెండు రోజుల క్రితం ఇండియాకు చేరుకుంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు, రామ్ చరణ్- తమన్నాలపై పాటల చిత్రీకరణ జరిగింది.
అయితే ఈ సినిమాను శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల చేసే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా అందిన సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు సినిమా విడుదలను మరికొంత కాలం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మార్చి నెలలో 'రచ్చ"ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
రచ్చ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్ మరియు పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ ఇమేజ్ కు తగిన విధంగా ఔట్ అంట్ ఔట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











