రామ్ చరణ్ కొత్త చిత్రం'రచ్చ'లో పాత్ర ఎలాంటిదంటే...
రామ్ చరణ్, సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రియల్ 25వ తేదీన ప్రారంభం కానుందని సమాచారం. ఆరెంజ్ చిత్రంతో చతికిల పడ్డ రామ్ చరణ్ ఆ తర్వాత మెరుపు చిత్రం ప్రారంబించినా బడ్జెట్ తదితర అంశాలతో సినిమాను ఆపివేసాడు. తన తండ్రి మెగాస్టార్ సలహాతో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయాలని నిర్ణయించుకుని ఈ చిత్రం ఓకే చేసాడు.ఈ చిత్రంలో కొత్త లుక్ తో కనిపించటంకోసం మియామి వెళ్ళి అక్కడ వర్కువుట్స్ చేస్తున్నారు. చిరంజీవి నైంటీస్ లో వేసిన క్యారెక్టర్స్ తరహాలో ఈ మాస్ రోల్ ఉండబోతోందని వినికిడి. ఈ చిత్రం అనంతరం వివి వినాయిక్ దర్శకత్వంలో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఫై పరాస్ జైన్, యన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మియామి, అమెరికాలో ఉన్న రామ్ చరణ్ ఏప్రిల్ 25 నుండి దాదాపు 50 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొననున్నాడు.


Click it and Unblock the Notifications











