షాక్ చేసే రామ్ చరణ్ 'రచ్చ' రిలీజ్ డేట్
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చపై ఓ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మగధీర రేంజిలో ఈ చిత్రం ఆడుతుందని బిజెనెస్ వర్గాల్లో టాక్ మొదలైంది. అయితే ఆ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేటట్లు కనపడటం లేదు. పిబ్రవరి 20 న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉంటుందేమో అనుకున్న చరణ్ అభిమానులకు ఇది చేదు వార్తే. ఇప్పటికే సంక్రాంతికి రవితేజ నిప్పు, బాలకృష్ణ అధినాయకుడు, వెంకటేష్ బాడీగార్డ్, మహేష్ ది బిజెనెస్ మ్యాన్ వంటి చిత్రాలు క్యూ కట్టాయి. దాంతో వీరి మధ్యలో పోటికి వెళ్లేకన్నా కూల్ వచ్చి కలెక్షవ్స్ కొల్లగొట్టడం బెస్ట్ అనే నిర్ణయానికి రామ్ చరణ్ వచ్చినట్లు చెప్తున్నారు.
ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తోందిది.


Click it and Unblock the Notifications











