RRR కంటే ముందే బాలీవుడ్ లో రామ్ చరణ్ మరో సినిమా.. అల్లు అర్జున్ మూవీ తరువాత భారీగా..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుస విజయాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం ఏ హీరోలు సినిమాలు విడుదల చేయడానికి పెద్దగా సాహసం చేయడం లేదు. కానీ తెలుగు హీరోలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ కరోనా కష్టకాలంలో కూడా ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక పుష్ప ప్రభావంతో కొన్ని టాలీవుడ్ సినిమాను కూడా హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. రామ్ చరణ్ కు సంబంధించిన సినిమా కూడా త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

RRR వచ్చి ఉంటే..

RRR వచ్చి ఉంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ గట్టిగానే పెరుగుతోంది అనే చెప్పాలి. ముఖ్యంగా మన స్టార్ హీరోల మార్కెట్ కూడా దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. RRR సినిమా కూడా విడుదల అయితే పాన్ ఇండియా రూట్ మరింత పెద్దదిగా మారేది. జనవరి 7న రావాల్సిన ఆ సినిమా కరోనా ప్రభావం వలన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ సినిమాను మళ్ళీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని చూస్తున్నారు.

ప్రభాస్ తరువాత..

ప్రభాస్ తరువాత..

ఇటీవల వచ్చిన పుష్ప పాన్ ఇండియా సినిమాగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అల్లు అర్జున్ ఎప్పటినుంచో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకోవాలని అనుకున్నాడు. ఇక మొత్తానికి పుష్ప సినిమాతో తన కలను నెరవేర్చుకున్నాడు. కేవలం పుష్ప హిందీలోనే 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

బాహుబలి సాహో సినిమాలతో ప్రభాస్ తర్వాత బాలీవుడ్ లో అత్యధిక స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సౌత్ హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు అందుకున్నాడు.

అల్లు అర్జున్.. మరో హిందీ సినిమా

అల్లు అర్జున్.. మరో హిందీ సినిమా

అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సక్సెస్ అందుకోవడంతో అతని పాత సినిమాలను కూడా బాలీవుడ్లో విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం కరోనా ఆంక్షల నేపథ్యంలో నార్త్ ఇండస్ట్రీలో చాలా వరకు థియేటర్స్ మూతపడ్డాయి. అక్కడక్కడా మాత్రమే కొన్ని థియేటర్స్ నడుస్తున్నాయి. అయితే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అల..వైకుంఠపురములో సినిమాను జనవరి 26 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ రంగస్థలం మూవీ..

రామ్ చరణ్ రంగస్థలం మూవీ..

అల.. వైకుంఠపురములో సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ కు సంబందించిన మరో సినిమా కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా పుష్ప ప్రభావం వల్లనే విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ రంగస్థలం సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు కూడా సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప కు వచ్చిన క్రేజ్ ను వాడుకుని రంగస్థలం సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాడట.

Recommended Video

RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu
RRR కంటే ముందే..

RRR కంటే ముందే..

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తల్ కలిసి నటించిన RRR సినిమా వాయిదా పడటంతో దానికంటే ముందే రంగస్థలం సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా బాలీవుడ్ లో కూడా ఎంతో కొంత సక్సెస్ అయితే రాబోయే RRR సినిమాకు హెల్ప్ అవుతుంది అనే చెప్పాలి.. మరి సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X