రామ్ చరణ్ - రణ్ వీర్ కాంబోలో సస్పెన్ థ్రిల్లర్.. హీరోయిన్లుగా దీపిక, త్రిష.. ఇంతకీ ఏంటా బిగ్ సీక్రెట్?

ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ - రణవీర్ సింగ్ కు ఉన్న క్రేజే వేరు. వీరిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఈ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే.. అభిమానులకు వచ్చే కిక్కే వేరబ్బా. మరి ఆ కిక్ ను డబుల్ చేసేలా వారిద్దరికి పక్కన దీపికా పదుకొణె-త్రిష ఉంటే.. అబ్బ ఇక ఆడియెన్స్ కు ఊహకందని పండగనే చెప్పాలి. అయితే ఇప్పుడది నిజం కాబోతుంది. అవును మీరు చదివింది. దాని గురించే ఈ కథనం...

'ఆర్ఆర్ఆర్' బిగ్గెస్ట్ హిట్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అప్పటికే రణ్ వీర్ సింగ్ దేశవ్యాప్తంగా ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఆ మధ్యలో చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రారంభోత్సవానికి కూడా రణ్ వీర్ స్పెషల్ గెస్ట్ హాజరై సందడి చేశారు. అప్పుడు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను ఫ్యాన్స్ ను మంచి ఉత్సాహాన్ని నింపాయి. అవి ప్రతి అభిమానిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలోనే కొంతమంది ఈ ఇద్దరు కలిసి నటిస్తే మాములుగా ఉండదు అని కూడా అనుకున్నారు.

ఆడియెన్స్ మదిలో బిగ్ సస్పెన్స్.. :అయితే ఆ తర్వాత దాని గురించి లైట్ తీసుకున్నారు. కానీ మళ్లీ ఇప్పుడు అందరి మదిలో ఓ ప్రశ్న మొదలైంది. వీరిద్దరూ కలిసి ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతున్నారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అందుకు కారణం.. రణవీర్ తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేయడమే. ఆ వీడియో ప్రారంభంలో దీపికా పదుకొణె తప్పిపోయిన తన భర్తపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తుంది.

Ram Charan, Ranveer Singh, Trisha and Deepika Padukone New Project and video is viral in social media

ఆ తర్వాత వెంటనే రణవీర్ సింగ్​ టార్గెట్​ ఫౌండ్​ అంటూ ఇంకెవరికో సమాచారం అందిస్తారు. ఆ వెంటనే రామ్ చరణ్ ఛేజింగ్‌ చేస్తూ కనిపించడం, పోలీస్ స్టేషన్‌లో త్రిష బాధపడుతూ నిల్చోవడం.. ఇలా వెంటవెంటనే నాలుగు ఇంట్రెస్టింగ్ షాట్లతో ఓ సస్పెన్స్ గ్లింప్స్ ను రిలీజే చేశారు. ఆ షాట్స్ మధ్య మధ్యలో 'కొన్ని రహస్యాలు.. రహస్యంగానే ఉండిపోవాలి', 'కొన్ని పశ్నలకు ఆన్సర్ ఇవ్వకపోవడమే మంచిది', 'కొన్ని రహస్యాలను పరిష్కరించకుండా వదిలేయడమే మంచి పద్దని'. అంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా ఆడియెన్స్​ మదిలో ఓ బిగ్ సస్పెన్స్​ను క్రియేట్​ చేసేశాయి. అందరూ అది ఏమై ఉంటుందా అని తెగ ఆలోచించేస్తున్నారు.

Ram Charan, Ranveer Singh, Trisha and Deepika Padukone New Project and video is viral in social media

త్వరలోనే రివీల్ అవుతుంది.. :అయితే మరోవైపు రణ్​వీర్​ సింగ్ వీడియోను పోస్ట్ చేస్తూనే దాని కింద 'సీక్వెట్ త్వరలోనే బయటపడుతుంది! బిగ్​ రివీల్​ కోసం వెయిట్ చేయండి' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో ఆడియెన్స్ అభిమానుల్లో ఆ స్పెషల్ గ్లింప్స్ పై ఆసక్తి పెరిగిపోయింది. ఫ్యాన్స్ అందరూ కన్​ఫ్యూజన్​లో పడిపోయారు. ఆ బిగ్ సీక్రెట్ రివీల్ ఎప్పుడూ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

Ram Charan, Ranveer Singh, Trisha and Deepika Padukone New Project and video is viral in social media

ప్రమోషన్ కోసమేనా.. :అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పుల్ ట్రెండ్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు ఇదంతా ఏదో యాడ్ కోసం అయి ఉంటుందని అంటుండగా.. మరి కొందరు ఓ కొత్త వెబ్ సిరీస్​ లేదా సినిమా కోసం ప్రమోషన్స్​ అయి ఉండొచ్చని కూడా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ బిగ్​ సీక్రెట్​ రివీల్​ అయితేనే అసలు విషయం బయటపడుతుంది, దాని కోసం ఎదురుచూస్తాం అని ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు. అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X