RC 15: హీరోయిన్ పెళ్లి సందర్భంగా శంకర్ స్పెషల్ ప్లాన్.. హీరోతో కలిసి సూపర్ సర్‌ప్రైజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రధాన కథానాయకగా కీయరా అద్వానీ నటిస్తోంది. అయితే ఇటీవల హీరోయిన్ కీయరా అద్వానీ పెళ్లి సందర్భంగా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే దర్శకుడు శంకర్ మాత్రం హీరోయిన్ తో సంబంధం లేని మిగతా సన్నివేశాలను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు.
ఇటీవల కీయరా అద్వానీ రాజస్థాన్లో అంగరంగ వైభవంగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లికి అతికొద్ది మంది కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలాగే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సినీ ప్రముఖులను కూడా ఇన్వైట్ చేసినట్లు టాక్ వచ్చింది. ముఖ్యంగా తన RC 15 యూనిట్ సభ్యులను కూడా పెళ్లికి పిలిచినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లికి మాత్రం వారు హాజరు కాలేకపోయారు.
షూటింగ్లో బిజీగా ఉండడం వలన పెళ్లికి వెళ్లకపోవడంతో ప్రత్యేకంగా వారు ఒక విషెస్ అయితే అందించారు. కీయరా అద్వానీ అలాగే సిద్దార్థ్ కు కూడా స్పెషల్ విషెస్ అందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. అందులో వాళ్ళు గాల్లోకి పూలు ఎగరవేస్తూ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో రామ్ చరణ్ తేజ్ తో పాటు దర్శకుడు శంకర్ అలాగే దిల్ రాజు మరి కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు.

ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు ముందస్తుగా ఒక ప్రణాళిక అయితే రచించారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సినిమా అప్పుడు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే మరొకవైపు శంఖర్ ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఇక RC15 ను మాత్రం కుదిరితే వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు అని సమాచారం.


Click it and Unblock the Notifications











