twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్ పరోక్షంగా ఆ విషయం చెప్పేశాడా.. బాబాయ్ పిలిచిన వెంటనే!

    |

    Recommended Video

    అప్పుడు బాబాయ్ వద్దన్నాడు, ఇప్పుడు అసలే ఆలోచించను: రామ్ చరణ్

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ చాలా కాలం తరువాత కార్పొరేట్ బ్రాండింగ్ లోకి దిగాడు. మగధీర సమయంలో పెప్సీ వంటి సంస్థలకు రాంచరణ్ బ్రాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రాంచరణ్ రంగస్థలంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. రంగస్థలం చిత్రంతో రాంచరణ్ స్థాయి మరో లెవల్ కు చేరింది. చరణ్ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. హ్యాపీ మొబైల్స్ సంస్థతో రాంచరణ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై గురువారం రోజు మీడియా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాంచరణ్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ సపోర్ట్ గురించి చరణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

     బాబాయ్ పిలవడమే ఆలస్యం

    బాబాయ్ పిలవడమే ఆలస్యం

    కళ్యాణ్ బాబాయ్ పిలవాలేకాని క్షణం కూడా ఆలోచించకుండా జనసేన పార్టీ తరుపున ప్రచారం చేస్తానని రాంచరణ్ తెలిపాడు. మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కరే జనసేన పార్టీని నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

    బాబాయ్, అబ్బాయి మధ్య ప్రేమ

    బాబాయ్, అబ్బాయి మధ్య ప్రేమ

    పవన్ కళ్యాణ్, రాంచరణ్ మధ్య అంతులేని ప్రేమానురాగాలు ఉన్నాయనే విషయం అందరికి తెలుసు. రంగస్థలం సక్సెస్ ఈ ఈవెంట్ లో ఆ విషయం అందరికి కనిపించింది. రాంచరణ్ తన సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

    చిరు దూరమైనట్లేనా

    చిరు దూరమైనట్లేనా

    రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన తరువాత మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఖైదీ చిత్రంతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం సైరా చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తదుపరి చిత్రాలకు కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. దీనితో మెగాస్టార్ చిరు రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లే అనే వాదన వినిపిస్తోంది.

    రాంచరణ్ పరోక్షంగా

    రాంచరణ్ పరోక్షంగా

    చిరు రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం లేదని రాంచరణ్ వ్యాఖ్యలతో కూడా అర్థం అయింది. అందు వలనే రాంచరణ్ బాబాయ్ కోసం ప్రచారానికి రెడీ అన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఏది ఏమైనా సినిమాలతో బిజీగా ఉన్న చరణ్ ని ప్రచారానికి పవన్ పిలవకపోవచ్చు.

    English summary
    Ram Charan ready to support Janasena. Chiru completely away from politics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X