»   » సుకుమార్ రికమండేషన్...రామ్ చరణ్ రిజక్ట్?

సుకుమార్ రికమండేషన్...రామ్ చరణ్ రిజక్ట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుకుమార్ లాంటి స్టార్ డైరక్టర్ చెప్పినా రామ్ చరణ్ కాదనటం అనేది విశేషమే. అయితే కోట్ల పెట్టబడితో జరిగే సినిమా నిర్మాణంలో ప్రతీ విషయంలో ఆచి,తూచి అడుగువేస్తూంటారు దర్శక,నిర్మాతలు. రీసెంట్ గా సుకుమార్...ఓ హీరోయిన్ ..రామ్ చరణ్ చిత్రం కోసం రికమెండ్ చేసారు. అయితే రామ్ చరణ్ ..నిర్విద్దంగా రిజెక్ట్ చేసారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

'అలా ఎలా' చిత్రంతో పరిచయమమైనా ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకోని హేబ్బ పటేల్ ని ఈరోజు సూపర్ హిట్ హీరోయిన్ ని చేసాడు సుకుమార్. ఆయన స్క్రిప్టు ఇచ్చి నిర్మించిన కుమారి 21 ఎఫ్ తో ఆమె ను చూస్తే...కుర్రకారును ఉరకలేసేలా హెబ్బాని రెడీ చేసాడు.

Ram Charan reject Hebah Patel?

ఆమెను తనకు ఉన్న పరిచయాలతో రామ్ చరణ్ కొత్త సినిమా, తని ఒరువన్ రిమేక్ లో నటించాడనికి ఆడిషన్స్ కు పంపిచటం జరిగింది. తని ఒరువన్ టీమ్ ...ఆమెకు ముందు ఓకే చెప్పినా, తరువాత రిజెక్ట్ చేసాడు. ఎందుకంటే రామ్ చరణ్, తన పక్కన చాలా చిన్న పిల్లలా ఉందని అనటం వల్లే రిజక్ట్ చేసారని తెలుస్తోంది.

అయితే ఇండస్ట్రీలో మరోవాదన వినిపిస్తోంది.. రాజ్ తరుణ్ పక్కన నటించిన పటేల్ చిన్న హీరోయిన్ అయ్యిందని...పెద్దగా క్రేజ్ ఉండదని రిజెక్టు చేసాడని అంటున్నారు. అయితే ఇది రూమరా ..లేక నిజంగా జరిగిందా అనేది తేలాల్సి ఉంది.

English summary
Sukumar was so impressed with Hebah Patel and he recommended her to Ram Charan for his next, ‘Thani Oruvan’ re-make.
Please Wait while comments are loading...