twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ దర్శకుడిని రిజెక్ట్ చేసిన రాంచరణ్.. కారణం ఇదే!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో రంగస్థలం లాంటి ఘనవిజయం తర్వాత రాంచరణ్ కు పరాజయం ఎదురైంది. రాంచరణ్ తన తదుపరి చిత్రాల విషయంలో పక్కా ప్లానింగ్ తో వ్యవహరిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి చిత్రంలో నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం ప్రారంభమైంది. అయినా కూడా చరణ్ తన తదుపరి చిత్రాల కోసం కథలని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

    రిజెక్ట్ చేసిన రాంచరణ్

    రిజెక్ట్ చేసిన రాంచరణ్

    ఇటీవల రాంచరణ్ ఓ యువ దర్శకుడి కథని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తొలి చిత్రంతోనే ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు పొందిన అతడు రాంచరణ్ వద్దకు కథ సిద్ధం చేసుకుని వెళ్ళాడట. కానీ అతడు చెప్పిన కథ రాంచరణ్ ని ఆకట్టుకోకపోవడంతో నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ ప్రస్తుతం అనుభవం ఉన్న దర్శకులతో సినిమాలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

     వరుసగా సీనియర్స్‌తో

    వరుసగా సీనియర్స్‌తో

    రాంచరణ్ తన కెరీర్ లో ఎక్కువగా సీనియర్ దర్శకులతోనే సినిమా చేస్తూ వస్తున్నాడు. సురేందర్ రెడ్డి, సుకుమార్, ప్రస్తుతం రాజమౌళి ఇలా స్టార్ దర్శకులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత తాను చేయబోయే సినిమా కోసం సీనియర్ దర్శకులు ఎవరైనా మంచి కథతో వస్తే ఒకే చేద్దాం అనే ఆలోచనలో రాంచరణ్ ఉన్నట్లు తెలుస్తోంది.

     నిర్మాతగా భాద్యతలు

    నిర్మాతగా భాద్యతలు

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రానికి రాంచరణే నిర్మాత. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా గడుపుతూనే చరణ్ తన తండ్రి సినిమా నిర్మాణ పనులు చూసుకుంటున్నాడు. దీనితో ఈ ఏడాది మొత్తం రాంచరణ్ కు బిజీగా ఉండబోతోంది.

     2020 తర్వాతే

    2020 తర్వాతే

    దర్శకధీరుడి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కావడంతో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అధికమొత్తంలో కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉంటుంది. దీనితో ఈ ఏడాది వీరిద్దరూ మరో చిత్రాన్ని ప్రారంభించే అవకాశం లేదు. కానీ చరణ్ మాత్రం ముందుగానే కథలు లాక్ చేసిపెట్టుకోవాలని భావిస్తున్నాడు. మరి రాంచరణ్ ని కథతో ఇంప్రెస్ చేసే దర్శకుడు ఎవరో వేచిచూడాలి.

    English summary
    Ram Charan rejects young directors story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X