‘ఎవడు’ కోసం చిరు హిట్ సాంగ్ రీమిక్స్
హైదరాబాద్ : రామ్ చరణ్ కు తన తండ్రి హిట్ సాంగ్స్ రీమిక్స్ చేయటం సెంటిమెంట్ గా మారినట్లుంది. వరసగా తన తండ్రి చిరంజీవి సినిమాల్లోని సూపర్‌హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 'మగధీర'తో మొదలైన ఈ సెంటిమెంట్ సినిమా సినిమాకీ బలపడుతోంది. ఆయన ప్రతీ సినిమాలోనూ తన తండ్రి పాట ఉండేలా చూసుకుంటున్నారు.
రాజమౌళితో చేసిన 'మగధీర'లో 'బంగారు కోడిపెట్ట' పాట రీమిక్స్ చేస్తే అది కాస్తా పెద్ద హిట్టయ్యింది. 'రచ్చ'లో 'వానా వానా వెల్లువాయె' అంటూ రామ్‌చరణ్, తమన్నా చేసిన డాన్స్ కు అభిమానులు నీరాజనాలు పట్టారు. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన నాయక్ లో 'శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో' రీమిక్స్ సాంగ్ కూడా ఆ సినిమా విజయంలో ఒకటిగా నిలిచింది.
ప్రస్తుతం రామ్‌చరణ్ తెలుగులో 'ఎవడు' సినిమా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. 'దిల్'రాజు నిర్మాత. 'ఎవడు'లో రీమిక్స్ సాంగ్ ఉపయోగించాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారట. 'రౌడీ అల్లుడు'లో చిరంజీవి, నృత్యతార శాంతిపై తీసిన 'బోలో బోలో బోలో రాణి ప్యార్ చాహియే' పాటను 'ఎవడు' సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నట్టుగా ఫిలిమ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. 'ఎవడు' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంతో జరుగుతోంది.
దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ''రామ్ చరణ్‌ని ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అలరిస్తాయని''అన్నారు. ఐటం సాంగ్ ల స్పెషలిస్ట్ అయిన దేవి ఈ చిత్రం కోసం కెవ్వు కేక పాటను మించేలా ఐటం సాంగ్ ని స్వరపరిచారని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











