మహేశ్ స్థానంలో స్టార్ హీరోను తీసుకున్న చిరంజీవి.. అతడికి జోడీని కూడా ఫిక్స్ చేశారు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు టాప్ హీరోగా కొనసాగారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంటర్ అయిన ఆయన.. దిగ్గజ నటులతో పోటీ పడి మరీ స్టార్ హీరోగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఫలితంగా ఎంతో మంది అభిమానులను సొతం చేసుకున్నారు. ఇక, రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన స్పీడుగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే తన సినిమా విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

కొంత ఉత్సాహం.. మరికొంత నిరుత్సాహం
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. చాలా గ్యాప్ తర్వాత నటించిన ఆయనకు ఈ సినిమా రూపంలో హిట్ వచ్చింది. అంతేకాదు, తనలో ఏమాత్రం మార్పులు జరగలేదని ఈ సినిమాతో నిరూపించారు. అయితే, దీని తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం చిరంజీవితో పాటు ఆయన అభిమానులకు నిరాశనే మిగిల్చింది.

బడా డైరెక్టర్‌తో భారీ ప్లాన్.. ఈ సారి ఇలా
‘సైరా' తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. దీనిని కూడా రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంస్థ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ‘ఆచార్య' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న యూనిట్.. ఎన్నో ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అది లీక్ అవడంతో అందరికీ క్లారిటీ వచ్చింది
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే మావోయిస్టు కథతో వస్తోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీలోని చిరంజీవి లుక్ దీనికి బలం చేకూర్చింది. కొద్ది రోజుల క్రితం లీక్ అయిన ఈ పిక్‌లో మెగాస్టార్.. మావోయిస్టుగా కనిపిస్తున్నారు. దీంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.

చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు కీ రోల్
ఇక, ఈ సినిమాకు సంబంధించిన హాట్ టాపిక్ అయిన విషయాల్లో... మహేశ్ బాబు గురించి వచ్చినవే ముఖ్యమైనవి. ఈ మూవీలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటిస్తున్నాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఆ పాత్రలో మహేశ్ చేస్తున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, అందుకోసం అతడికి రూ. 30 కోట్లు ఇస్తున్నారని కూడా అన్నారు

అక్కడే తేడా వచ్చింది.. మహేశ్ బాబు ఔట్
మహేశ్ ఇందులో పలానా రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే... అతడు ఈ మూవీలో నటించడం లేదన్న వార్త ఒకటి బయటకు వచ్చింది. దీనికి కారణం.. సూపర్ స్టార్ అడిగిన రెమ్యూనరేషనే అని గుసగుసలు వినిపించాయి. వాస్తవానికి ఈ మూవీకి మహేశ్ రూ. 30 కోట్లు అడగగా... చిరంజీవి అండ్ కో మాత్రం రూ. 15 కోట్లు ఇస్తామని చెప్పిందని సమాచారం.
Recommended Video

మహేశ్ స్థానంలో స్టార్ హీరో.. హీరోయిన్ ఆమె
ఈ సినిమాలో మరో పాత్రకు సంబంధించిన రోల్ విషయంలో చిరంజీవికి కీలక నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఓ వార్త లీక్ అయింది. దీని ప్రకారం... ఈ పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణే చేస్తున్నాడట. దాదాపు ముప్పై నిమిషాలు ఉండే ఈ రోల్ ఎంతో ముఖ్యమైనది అని సమాచారం. అంతేకాదు, చెర్రీకి జోడీగా రష్మిక మందన్నాను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











