రజినీకాంత్‌కి రామ్ చరణ్ రిక్వెస్ట్.. తండ్రి కోసం తనయుడి ప్రయత్నం
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా.. తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలు నడుమ ఈ సినిమా అక్టోబర్ 2 తేదీన విడుదల కానుంది. మెగాస్టార్ 151 వ సినిమాగా వస్తున్న సైరా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లో సినిమాపై హైప్ తీసుకొచ్చేలా ప్రమోషన్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇందులో భాగం గానే సైరా నరసింహా రెడ్డి తమిళ టీజర్‌ను కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయించాలని చెర్రీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 20 తర్వాత సైరా టీజర్ విడుదల కానుంది.

తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. చిత్రంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇక ఇటీవలే విడుదలైన సైరా మేకింగ్ వీడియో సృష్టించిన సంచలనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


Click it and Unblock the Notifications











