రామ్ చరణ్ నిర్మాతకు రూ. 3 కోట్లు తిరిగిచ్చాడట?

By Bojja Kumar

హైదరాబాద్: ‘గోవిందుడు అందరి' వాడేలే చిత్రానకి సంబంధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసినప్పటికీ హెవీ బడ్జెట్ కారణంగా కొంత నష్టాలు వచ్చినట్లు టాక్. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరరెక్కిన ‘గోవిందుడు అందరి వాడేలే' తొలిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది.

Ram Charan returns 3 crores to Bandla Ganesh

ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ చరణ్ నటించారు. కొన్ని కారణాల విడిపోయిన తన కుటుంబ సభ్యులను కలపడానికి హీరో ఏం చేసాడు? అనే పాయింటుతో సాగిన స్టోరీకి ఫ్యామిలీ అనుబంధాలు, ఆప్యాయతలు, ఎమోషన్స్, బావామరదళ్ల సరసాలు యాడ్ చేసి వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణ వంశీ.

ప్రకాష్ రాజ్, జయసుధ, రహహాన్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ, నిర్మాత : బండ్ల గణేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X