చరణ్-ఉపాసనల పై వస్తున్న సెటర్లైకు కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్
రామ్ చరణ్ ఛాయిస్ ఉపాసన కామినేని చూసి అతనికి మంచి టేస్ట్ లేదని అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నోడు కేవలం స్టేటస్ కి మాత్రమే విలువ ఇచ్చి గ్లామర్ ని పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అయితే ఎవరి వ్యక్తిగత అభిరుచి వారికి ఉంటుంది కనుక దానిపై కామెంట్ చేయడం పద్దతి కాదు.
అయితే చరణ్ కూడా తాను ఉపాసన శారీరక అందాన్ని చూసి ప్రేమించానని మాత్రం చెప్పట్లదు. ఆమె మానసిన సౌందర్యానికి ముగ్దుడినయ్యానని అతనంటున్నాడు. ఆమెకి మనుషుల పట్ల, జంతువుల పట్ల అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, ఆమె గొప్ప తత్వవేత్త కూడా అని చరణ్ చెప్పాడు. ఆమె మనసుని చూసే ప్రేమలో పడ్డానని, తన ప్రేమ గురించి పెద్దలకి చెప్పి వారి సమ్మతం తీసుకున్నాకే దానిని బయటపెట్టాలని అనుకున్నామని చరణ్ చెప్పుకొచ్చాడు. కాగా రామ్ చరణ్ ఉపాసనల నిశ్చితార్థ డిసెంబర్ లో జరుగుతుందని. 2012లో వివాహం జరగవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











