మరో లీక్: ఆచార్యలో రామ్ చరణ్ రోల్ ఇదే.. చిరు ముందే అలా జరిగితే ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా.!
చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. బ్యాగ్రౌండ్ లేకున్నా సినిమాల్లోకి ప్రవేశించి... తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పోటీని తట్టుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లారు. కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తాజాగా అతడి పాత్ర వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసం.!

అనుకున్నదొకటి.. అయింది మరొకటి
సుదీర్ఘ విరామం అనంతరం ‘ఖైదీ నెంబర్ 150'తో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులను తిరగరాసింది. అలాగే, చిరులో ఏ మాత్రం మార్పు లేదని నిరూపించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం నిరుత్సాహ పరిచింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ వాటిని అందుకోలేకపోయింది.

బడా డైరెక్టర్‌తో మూవీ.. ఫుల్ కాన్ఫిడెన్స్
‘సైరా' నిరాశ పరచడంతో ఈ సారి భారీ విజయంపై కన్నేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే బడా డైరెక్టర్ కొరటాల శివతో ఆయన సినిమా చేస్తున్నాడు. దీన్ని కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ‘ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఒక లీక్.. ఒక పొరపాటు.. క్లారిటీ వచ్చేసింది
ఈ సినిమా కథ, టైటిల్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చిరు.. నక్సలైట్‌గా కనిపించబోతున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. వాటికి అనుగుణంగానే కొద్ది రోజుల క్రితం షూటింగ్ స్పాట్‌లోని లుక్ లీక్ అయింది. ఆ తర్వాత ఓ ఫంక్షన్‌లో సినిమా పేరు ‘ఆచార్య' అని చిరంజీవే పొరపాటుగా రివీల్ చేసేశాడు.

చరణ్ స్థానంలో మహేశ్.. మొదటికే వచ్చింది
వాస్తవానికి ఈ సినిమాలో రామ్ చరణ్ చిన్న పాత్రను పోషిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటీవల చెర్రీ స్థానంలో మహేశ్ బాబును తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలకు, మహేశ్‌కు మధ్య రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో చరణ్‌నే తీసుకుంటున్నారని తాజాగా టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

మరో లీక్: ఆచార్యలో రామ్ చరణ్ రోల్ ఇదే
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ పోషిస్తోన్న పాత్రకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో చరణ్ నక్సలైట్‌గా కనిపించబోతున్నాడట. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకే కీలకమని అంటున్నారు. ఇందులో అతడి లుక్ అదిరిపోతుందని టాక్.

మెగా ఫ్యాన్స్ ఈ విషయాన్ని జీర్ణించుకుంటారా.!
రామ్ చరణ్ పాత్ర వివరాలు మాత్రమే కాదు.. సినిమా కథ కూడా లీక్ అయింది. దేవాదాయ భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా మిషన్ కొనసాగిస్తూ నక్సలైట్ రామ్ చరణ్ మరణిస్తాడట. అతడి ఆత్మీయుడైన చిరంజీవి.. దాన్ని కొనసాగించేందుకు అడవుల్లోకి వెళ్తాడట. ఇంత వరకు బాగానే ఉన్నా.. సినిమాలో చెర్రీ మరణాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా అన్నది ప్రశ్నర్థకంగా మారింది.


Click it and Unblock the Notifications











