»   » రామ్ చరణ్ సరసన కాజల్ ఖరారు?

రామ్ చరణ్ సరసన కాజల్ ఖరారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రామ్ చరణ్ సరసన ముచ్చటగా మూడోసారి కాజల్ చేయనుందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందనున్న మల్టి స్టారర్ చిత్రం కోసం ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ని అనుకుని, చివరకు కాజలే బెస్ట్ అని ఫైనలైజ్ చేసినట్లు వినపడుతోంది. ముఖ్యంగా మగధీర,నాయక్ చిత్రాలతో వీరిద్దరూ హిట్ పెయిర్ గా పేరొందారు. దాంతో సెంటిమెంట్ దృష్ట్యా కూడా ఈ మ్యాజిక్ మరోసారి వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తారని తెలుస్తోంది.

రామ్ చరణ్ త్వరలో కృష్ణ వంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నరంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమేనని, వెంకటేష్ గారితో కలిసి పని చేయబోతున్నట్లు రామ్ చరణ్ సైతం మీడియాకు స్వయంగా వెల్లడిచారు. ఈ చిత్రం వెంటనే ప్రారంభించాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం.

రామ్ చరణ్ మాట్లాడుతూ... తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం ఆ కథమీదే కూర్చున్నాం. కృష్ణవంశీ ఒక మంచి కుటుంబ కథని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు కుటుంబకథా చిత్రాల్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. అలాగే వెంకటేష్‌గారితో కలిసి నటించాలని ఎప్పట్నుంచో అనుకొం టున్నా. అది త్వరలోనే నెరవేరుతుంది. ఇది మల్టీస్టారర్‌ చిత్రమే. పూర్తి వివరాలు మాత్రం నెల తర్వాత తెలుస్తాయి అన్నారు.

English summary

 Ram Charan and Kajal Aggarwal are all set to share screen space together for the third time. According to sources, apparently, the makers are considering Kajal's name for the leading lady to be paired opposite Ram Charan in his forthcoming multi-starrer to be directed by Krishna Vamsi. Charan and Kajal have already worked together for super hit films like Magadheera and Naayak and if all goes well, the couple could recreate the same magic. Let's await the official confirmation. The untitled film, which also stars Venkatesh, will be produced by Banlda Ganesh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu