రామ్ చరణ్ తో రచ్చ చేయటానకి తమన్నా సిద్దం
సంపత్ నంది, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం త్వరలో రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాని ఎంపికచేసారని తాజా సమాచారం. మెరుపు ప్రాజెక్టు ఆగిపోవటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. 'ఏమైంది ఈ వేళ' విజయం రామ్ చరణ్ ని ఈ కథను ఒప్పుకునేలా చేసింది. ఇక తమన్నా విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలో చేస్తోంది. అలాగే నాగచైతన్య,సుకుమార్ కాంబినేష్ లో రూపొందుతున్న చిత్రంలోనూ, ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లోనూ చేస్తోంది. అలాగే తమిళ సినిమాలు కూడా కొన్ని కమిటైంది.
ఇక తమిళ దర్శకుడు ధరణి చెయ్యాల్సిన మెరుపు ని రామ్ చరణ్ తేజ ఆ సినిమాని రకరకాల కారణాలతో ఆపేసారు. దాంతో ఆ చిత్ర నిర్మాత ఎన్.వి.ప్రసాద్..దర్శకుడుని మార్చి ట్రై చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిత్రం ఏమైంది ఈ వేళ తో హిట్ కొట్టిన సంపత్ నందిని సీన్ లోకి తీసుకు వచ్చారు. సంపత్ నంది ఓ కథని రామ్ చరణ్ కి నేరేట్ చేయటం, అది వెంటనే నచ్చటం జరిగింది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని తెలుస్తోంది. చిరంజీవి కూడా కథ విని ఆమోద ముద్ర వేసేడని తెలుస్తోంది. రామ్ చరణ్ ఓకే చేయటంతో రెట్టించిన ఉత్సాహంతో సంపత్ నంది ఆ స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుతున్నారు.అలాగే ఈ కొత్త చిత్రం టైటిల్ రచ్చ అని కూడా అంతటా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











