బాలీవుడ్ బ్యూటీతో రామ్ చరణ్ రొమాన్స్.. భారీ ఖర్చు.. అట్టహాసంగా ఏర్పాట్లు!

బాలీవుడ్ బ్యూటీతో రామ్ చరణ్ రొమాన్స్ చేయబోతున్నారట. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తూ అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ బయటకొచ్చింది. రామ్ చరణ్ తాజా సినిమా RRR కోసం ఓ రేంజ్‌లో స్కెచ్ వేశారట రాజమౌళి. RRRలో రామ్ చరణ్- ఆలియా భట్ జంటపై ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారని తాజా సమాచారం. సినిమాకే హైలైట్ అయ్యేలా ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దామా..

రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలతో

రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలతో

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా RRR. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరి సరసన ముద్దుగుమ్మలు ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రత్యేకంగా స్క్రిప్ట్‌లో మార్పులు.. మెగా అభిమానులకు ట్రీట్

ప్రత్యేకంగా స్క్రిప్ట్‌లో మార్పులు.. మెగా అభిమానులకు ట్రీట్

RRR సినిమాలో మెగా, నందమూరి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ఇద్దరు హీరోలకు సమన ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్త వహిస్తున్నారట. ఇందుకోసమే ప్రత్యేకంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కూడా చేసిన రాజమౌళి.. రామ్ చరణ్, ఆలియాలపై అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

 RRR హైలైట్స్‌లో ఒకటి.. రామ్ చరణ్, ఆలియా భట్ డాన్స్

RRR హైలైట్స్‌లో ఒకటి.. రామ్ చరణ్, ఆలియా భట్ డాన్స్

ఈ సాంగ్ కోసం ప్రత్యేకించి ఒక భారీ సెట్ వేస్తున్నారనేది లేటెస్ట్ సమాచారం. ఈ సాంగ్ కోసం ప్రస్తుతం రామ్ చరణ్, ఆలియా భట్ ఇద్దరూ డాన్స్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. RRR హైలైట్స్‌లో ఒకటిగా ఈ సాంగ్ నిలిచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ పాట కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ డాన్స్ మిస్ అనుకున్నారు.. కానీ

ఆ డాన్స్ మిస్ అనుకున్నారు.. కానీ

RRR సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయా అనే ఆసక్తి అభిమానుల్లో ఉన్న సంగతి తెలిసిందే. 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్సులు మిస్ అవుతామేమో అని భావించారు వారి వారి ఫ్యాన్స్. కానీ మెగా, నందమూరి అభిమానులకు కనువిందు చేసేలా ఏడు పాటలు, హోరెత్తిపోయే డాన్సులు రూపొందిస్తున్నారట జక్కన్న.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
RRR మూవీ

RRR మూవీ

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూలై 30 వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X